-జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం వాలంటీర్ కు రోజుకు ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ లక్ష్యం
-ప్రతి శుక్రవారం ప్రభుత్వ పథకాల పురోగతిని సమీక్షించేందుకు ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు.
-రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పీపీసీ సెంటర్లు ద్వారా ధాన్యం కొనుగోలును సమర్థవంతంగా చేయాలి..
-జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశం.
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పక్కా రిజిస్ట్రేషన్ తో పేద ప్రజల సొంత ఇంటి యజమానులుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోనే విధంగా అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టరు జె. నివాస్ అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం నుండి జగనన్న ఇళ్ల నిర్మాణం, జగనన్న సంపూర్ణ గృహ హక్కు, వ్యాక్సినేషన్, శానిటేషన్, ధాన్యం కొనుగోలు కేంద్రాల వంటి అంశాలపై శుక్రవారం డివిజన్ మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు జె. నివాస్ మాట్లాడుతూ జిల్లాలలో ప్రతి శుక్రవారం క్షేత్రస్థాయిలో జరుతుగన్న ప్రభుత్వ పథకాల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకాధికారులు పర్యేక్షిస్తారన్నారు. జిల్లాలో 734 ధాన్యం కొనుకోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని ఇప్పటికే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. ప్రతి పీపీసి కేందాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తేమ శాతాన్ని పరిశీలించి సకాలంలో ధాన్యాన్ని కోలుగోలు చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా ఒన్ టైమ్ సెటిల్ మెంట్ ను ద్వారా లబ్దిదారుల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. లబ్దిదారులు ఇంటి నిర్మాణం నిమిత్తం ఎంత తీసుకున్నా పదివేలు రూపాయలు కడితే తీసుకున్న లోన్ మినహాయించి రిజిస్ట్రేన్ చేస్తుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 5 వేలమంది కట్టారన్నారు. ఈ పథకం కింద రుణం పొందిన లబ్దిదారులు 2.40 లక్షల మంది ఉన్నారని అందులో లక్ష మంది కడతారని భావివస్తున్నామన్నారు. మండల స్తాయి అధికారులు ఓటీఎస్ పై లబ్దిదారుల్లో ఉన్న అపోహలన తొలగించి వారికి అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు గ్రామ స్థాయిలో ప్రతి సోమవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ పథకం కింద వాలంటీర్ కు రోజుకు ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ లక్ష్యం గా నిర్ణయించామన్నారు. అదేవిందాగా సంపూర్ భూ హక్కు పథకం పై సమీక్షించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణంలో లబ్దిదారులకు అవసరమైన స్టీలు, సిమ్మెంట్, ఇసుక అందుబాటులో ఉంచి అందిస్తున్నామన్నారు. అదేవిధంగా గుడివాడ అర్భన్ లో టిడ్కో ఇళ్లు పక్కనే మంచి లేఅవుట్ లో ఇళ్లు ఉన్నాయని లబ్దిదారులు ఇళ్లు నిర్మించుకునే విదంగా గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో జగనన్న కాలనీల్లో జిల్లా వ్యాప్తంగా వారానికి 500 ఇళ్లు, మండల స్థాయిలో 20 ఇళ్లు చొప్పున నిర్మించే విదంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో విజయవాడ నుంచి జాయింట్ కలెక్టర్ లు ఎల్.శివశంకర్, కె. మోహన్ కుమార్, శ్రీవాస్ నుపుర్ అజయ్ కుమార్, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామచంద్రన్, మండల తహసీల్దార్ల, ఎంపిడిఓలు, మునిసిపల్ కమిషనర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, గుడివాడ నుంచి ఆర్డీవో శ్రీనుకుమార్, తాహశీల్థారు శ్రీనువాసరావు, హౌసింగా ఈఈ శ్రీదేవి, డీఈ రామోజీ నాయక్ ప్రభృతులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News