Breaking News

పారిశ్రామిక అభివృద్ధికి ఏపీ చాంబర్స్ చురుకైన పాత్ర అభినందనీయం

-ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు భూమి కేటాయింపునకు సహకరిస్తా: ఎంపీ కేశినేని చిన్ని
-విజయవాడ ఉత్సవ్‌ను విజయవంతం చేయడంలో అన్ని వర్గాలు భాగస్వాములు కావాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక, వాణిజ్య రంగాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ చాంబర్స్) అందిస్తున్న సేవలు, చురుకైన పాత్ర అభినందనీయమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు, ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు.ఏపీ చాంబర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశానికి ఎంపీ కేశినేని చిన్ని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో చాంబర్ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు, ఇతర భాగస్వామ్య వర్గాలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి అవసరమైన వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడంలో ఏపీ చాంబర్స్ చేస్తున్న కృషి కీలకమన్నారు. పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారం, మౌలిక వసతులు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం, పరిశ్రమల రంగం పరస్పర సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు

ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేయడానికి అవసరమైన భూమి కేటాయింపునకు తన వంతు సహకారం అందిస్తానని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు యువతకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.ఎంఎస్‌ఎంఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం సంబంధిత వర్గాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని చెప్పారు.

ఇటీవల ‘ఐకానిక్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్–2026’ అవార్డును అందుకున్న తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ బోర్డు సభ్యులు సీఎం మోహన్ శ్యాం ప్రసాద్‌ను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. అలాగే ఏపీ చాంబర్స్‌కు అనుబంధంగా ఉన్న వివిధ సంఘాల అధ్యక్షులను కూడా సమావేశంలో సత్కరించారు.

విజయవాడ నగర అభివృద్ధి, పర్యాటక రంగానికి మరింత ప్రాచుర్యం కల్పించే దిశగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్‌ను ఘనంగా విజయవంతం చేయాలని ఎంపీ కేశినేని చిన్ని పిలుపునిచ్చారు. వాణిజ్య, పారిశ్రామిక, సాంస్కృతిక, పర్యాటక రంగాలకు చెందిన అన్ని వర్గాలు ఉత్సవంలో చురుకుగా పాల్గొని తమ వంతు భాగస్వామ్యం అందించాలని కోరారు.విజయవాడ ఉత్సవ్‌ను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా నగరానికి చెందిన ప్రతి ఒక్కరి ఉత్సవంగా భావించి విజయవంతం చేయాలని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రీజినల్ స్పిరిచువల్ టూరిజం డెవలప్‌మెంట్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎంపీ చిన్ని తెలిపారు. రాష్ట్రంలోని ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించడంతో పాటు వాణిజ్య, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు.విజయవాడకు ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యతను మరింతగా ప్రపంచానికి పరిచయం చేసే కార్యక్రమాల్లో పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు కూడా భాగస్వాములు కావాలని కోరారు.

ఈ సమావేశంలో ఏపీ చాంబర్స్ అధ్యక్షులు పొట్లూరి భాస్కరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బి. రాజశేఖర్, జనరల్ సెక్రటరీ సుబ్బారావు, కోశాధికారి అక్కయ్య నాయుడు, బోర్డు సభ్యులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

-డబుల్ ఇంజన్ సర్కార్‌తో పేదలకు వందల రెట్ల లబ్ది -ఎన్టీఆర్ జిల్లాలో ఇంటి పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *