విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి ప్రముఖ నగరాలలో ‘శ్రీ వేద విజ్ఞాన పరిషత’ ఆధ్వర్యంలో అత్యంత ప్రజాభిమానం, విశిష్ట ప్రాచుర్యం పొందిన “బ్రాహ్మణ సంక్షేమ మేధావుల ఆత్మీయ సదస్సులు” దిగ్విజయంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఆత్మీయ చర్చా వేదికల్లో బ్రాహ్మణ మేధావులు ఏకగ్రీవంగా ఆమోదించిన చారిత్రాత్మక తీర్మానాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ పార్టీలన్నింటికీ నివేదించే కీలక కార్యక్రమం ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా, ఏపీ కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులకు ఈ తీర్మానాల ప్రతిని అందజేసేందుకు శ్రీ వేద విజ్ఞాన పరిషత్ నేతృత్వంలోని ఒక ఉన్నత స్థాయి బ్రాహ్మణ మేధావుల ప్రతినిధి వర్గం దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకుంది.ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో బ్రాహ్మణ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల వివిధ రాజకీయ పార్టీలు అవలంబిస్తున్న ఉదాసీన వైఖరిని (చిన్నచూపును) జాతీయ నాయకత్వానికి కళ్లకు కట్టేందుకు ఈ ప్రతినిధి వర్గం ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయాల్లో విస్తృతంగా పర్యటిస్తోంది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఆర్థిక, సామాజిక, మరియు రాజకీయ హక్కులను, సమస్యలను సమగ్రంగా వివరిస్తూ రూపొందించిన “బ్రాహ్మణ సామాజిక వర్గ మేధావుల వినతి పత్రాన్ని” పలువురు ప్రముఖ జాతీయ నాయకులకు ఈ బృందం అందజేసింది.విశిష్ట వ్యక్తులతో కూడిన ప్రతినిధి వర్గం:రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల నుండి విచ్చేసిన ప్రముఖులు మరియు మేధావులతో కూడిన ఈ ప్రతినిధి వర్గంలో ఈ క్రింది వారు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. దేవరకొండ వెంకట బాలసుబ్రమణ్యం (చైర్మన్-శ్రీ వేద విజ్ఞాన పరిషత్, ప్రముఖ రచయిత, సామాజికవేత్త)ఎం. సత్యనారాయణ (కడప జిల్లా) గంటి రవి కుమార్ (అనకాపల్లి జిల్లా) కె.ఎస్.ఎన్. రాజు (విశాఖపట్నం జిల్లా)యామిజాల నరసింహమూర్తి (పశ్చిమగోదావరి జిల్లా)అనిల్ కుమార్ సిద్ధాంతి (ఏలూరు జిల్లా)వేదుల రామకృష్ణ శర్మ (రిటైర్డ్ డిజిఎం`బిఎసఎనఎల్, విశాఖపట్నం) ఈ సందర్భంగా శ్రీ వేద విజ్ఞాన పరిషత్ చైర్మన్ దేవరకొండ వెంకట బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ, బ్రాహ్మణుల న్యాయమైన డిమాండ్లు, వారి సామాజిక భద్రత మరియు రాజకీయ ప్రాతినిధ్యంపై జాతీయ స్థాయిలో సానుకూల నిర్ణయం వచ్చే వరకు ఈ పోరాటాన్ని, నివేదనల కార్యక్రమాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. ఈ పర్యటన జాతీయ నేతల దృష్టిని ఆకర్షించడంలో విశేషమైన విజయాన్ని సాధించిందని ప్రతినిధి వర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News