శిథిలావస్థకు చేరిన విఎంసి దుకాణాల తొలగింపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు గురువారం ఉదయం సింగ్ నగర్ స్టేడియం షాపింగ్ కాంప్లెక్స్‌లో శిథిలావస్థకు చేరిన ఖాళీ దుకాణాల తొలగింపు (డెమాలిషన్) కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ అధికారులు చేపట్టారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదకరంగా ఉన్న దుకాణాల నిర్మాణాలను తొలగించారు. ఎస్టేట్, టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన అధికారులు, ఎన్‌క్రోచ్‌మెంట్ సిబ్బంది సమన్వయంతో ఈ చర్యలు చేపట్టారు. తొలగింపు ప్రక్రియలో తలెత్తే టౌన్ ప్లానింగ్‌కు సంబంధించిన అంశాలను అధికారులు పరిశీలించారు. నగరంలో శిథిలావస్థలో ఉన్న, ప్రజలకు ప్రమాదకరంగా మారే నిర్మాణాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.ఎం. అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్ నాగేశ్వరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఎస్టేట్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేయాలి…

-స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ -గూడవల్లి పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ‘స్వచ్ఛ ఆంధ్ర’చైర్మన్, డైరెక్టర్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *