Breaking News

“సుజనా ఫౌండేషన్” ఆధ్వర్యంలో గర్భిణీలకు ఉచిత వైద్య పరీక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి “సుజనా ఫౌండేషన్” ఆధ్వర్యంలో గర్భిణీల కోసం ప్రారంభించిన ఉచిత మొబైల్ 2డీ ఎకో హెల్త్ స్క్రీనింగ్ క్యాంపులకు విశేష స్పందన లభిస్తోంది. మంగళవారం , హెచ్ బీ కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నిర్వహించిన ఈ ఉచిత హెల్త్ స్క్రీనింగ్ లను స్థానిక గర్భిణీ స్త్రీలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఉచిత హెల్త్ స్క్రీనింగ్ ల ద్వారా మహిళలో గర్భధారణ సమయంలో వచ్చే గుండె జబ్బులు ముందుగానే గుర్తించి ప్రాణాంతక సమస్యలను నివారించడం సాధ్యమవుతుంది. పేద, మధ్య తరగతి ప్రజలకు , గర్భిణీలకు ఎటువంటి ఖర్చు లేకుండా అత్యాధునిక వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా ” సుజనా ఫౌండేషన్” నిరంతరం కృషి చేస్తుంది. మధ్యాహ్నం వరకు కొనసాగిన ఈ శిబిరంలో 16 మంది గర్భిణీలకు 2డీ ఎకో మాటర్నల్ కార్డియాక్ రిస్క్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ ఎన్ వంశీ, 2డీ ఎకో టెక్నీషియన్స్ సుప్రియ, సింధుప్రియ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఆశా వర్కర్లు, సుజనా ఫౌండేషన్ సిబ్బంది, సుజన మిత్రా కోఆర్డినేటర్లు ఈ శిబిరంలో తమ సేవలందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

-డబుల్ ఇంజన్ సర్కార్‌తో పేదలకు వందల రెట్ల లబ్ది -ఎన్టీఆర్ జిల్లాలో ఇంటి పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *