Breaking News

ఓటర్ల జాబితాను కొత్తగా షెడ్యూల్ విడుదల…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల ప్రకారం కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల జాబితాను కొత్తగా షెడ్యూల్ విడుదల చేశారని, 01.11.2026 ని అర్హత తేదీగా గత 6 కాలంలో కనీసం మూడేళ్లు పూర్తికాలం ఉపాధ్యాయుడిగా బోధించిన అనుభవం ఉండి, ప్రభుత్వ గుర్తింపు పొందిన సెకండరీ లేదా అంతకంటే ఎక్కువ స్థాయి విద్యాసంస్థల్లో పనిచేస్తున్నవారు ఈ ఓటు హక్కు నమోదుకు అర్హులని, గతంలో ఓటు ఉన్నవారు కూడా తప్పనిసరిగా కొత్తగా ఫారమ్-19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. మంగళవారం ఎమ్మెల్సీ ఓట్ల నమోదు, స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై జిఎంసి ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో అధికారులతో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అర్హులైన ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను సంబంధిత సర్వీస్ సర్టిఫికేట్‌తో జతచేసి నవంబర్ 6 నాటికి అందించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తులను పరిశీలించి నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించి, అభ్యంతరాలు లేదా క్లెయిమ్‌లను నవంబర్ 25నుండి డిశంబర్ 10 వరకు స్వీకరిస్తారన్నారు. అభ్యంతరాలన్నింటినీ పరిష్కరించి, తుది ఓటర్ల జాబితాను డిశంబర్ 30న అధికారికంగా ప్రచురిస్తాని తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఓటర్ల నమోదుకు విద్యా శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని తగిన ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు.
అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడుతూ, జోనల్ అధికారులు, ఎంసిసి టీం, పోలింగ్ పర్సన్స్ నియామకంపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్లు, అదనపు కమిషనర్ ని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని రకాల మెటీరియల్ ని అందించడానికి టెండర్స్ పిలవాలని, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులపై నివేదిక ఇవ్వాలని ఎస్ఈ ని ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటుపై పరిశీలించిన కేంద్రాల మ్యాప్ లను సిద్దం చేయాలని సిటి ప్లానర్ ని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో అధికారులు, శాఖల మధ్య సమన్వయం కీలకమని, ప్రతి ఒక్కరూ కేటాయించిన విధుల్లో అంకిత భావంతో ఉండాలన్నారు.
సమావేశంలో అదనపు కమిషనర్ ఐ.కిషోర్, డిప్యూటీ కమిషనర్లు జి.సాంబశివరావు, బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, సిటి ప్లానర్ రాంబాబు, ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

-డబుల్ ఇంజన్ సర్కార్‌తో పేదలకు వందల రెట్ల లబ్ది -ఎన్టీఆర్ జిల్లాలో ఇంటి పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *