Breaking News

గ్రామీణ అభివృద్ధికి కొత్త ఊపు… : డా. పసుపులేటి హరిప్రసాద్

ఉదయగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
పల్లెల అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి పునాది అని, ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడేలా, ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించేలా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నిర్వహించిన పల్లె పండుగ 3.0 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, వ్యవసాయం, ఉపాధి, పరిశుభ్రత, మౌలిక వసతులు, పర్యాటక రంగాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. పల్లె పండుగ 1.0, 2.0 కార్యక్రమాల ద్వారా రూ.9 వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టగా, పల్లె పండుగ 3.0లో రూ.11,085 కోట్లతో భారీ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో 6 వేల కి.మీ. సీసీ రోడ్లు, 9,500 కి.మీ. బీటీ రోడ్లు, 22,500 మినీ గోకులాలు, 50 వేల ఎకరాల్లో పండ్ల తోటలు, 1,000 కి.మీ. మ్యాజిక్ డ్రెయిన్లు, బస్ షెల్టర్లు, గ్రామ పంచాయతీ భవనాలు, రచ్చబండలు తదితర పనులు ఉన్నాయి. గ్రామీణాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, అభివృద్ధి పనుల నాణ్యతను ప్రజలు పర్యవేక్షించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొని గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పట్టాల పంపిణీతో 26వేల పేద కుటుంబాలకు భరోసా

-డబుల్ ఇంజన్ సర్కార్‌తో పేదలకు వందల రెట్ల లబ్ది -ఎన్టీఆర్ జిల్లాలో ఇంటి పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *