నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
నూజివీడు డివిజన్ లో 27వ తేదీన 78 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. గన్నవరం మండలం లో 24, ఉంగుటూరు 6, , బాపులపాడు 26, నూజివీడు అర్బన్ 2 , నూజివీడు రూరల్ లో 7, పమిడిముక్కలలో 6, చాట్రాయి 4, అగిరిపల్లి మండలంలో 3 కేసులు నమోదయ్యాయన్నారు. . కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, సానిటైజెర్ వినియోగించాలని, బహిరంగ ప్రదేశాలలో సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. అవసరం లేకుండా బయటకు రావద్దని, కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వంతో సహకరించాలని ఆర్డీఓ రాజ్యలక్ష్మి ప్రజలకు విజ్ఞప్తి చేసారు.
Tags nuzividu
Check Also
డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …