-గ్రేహాండ్స్ శిక్షణా కేంద్రం నిర్వాసితులకు నిధులు అందజేయండి…
-ముఖ్యమంత్రికి మంత్రి అవంతి లేఖ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఉన్న ఆనందపురం మండలం చండక గ్రామ పరిధిలో ఇండో టిబేట్ బోర్డర్ పోలీసు (ఐటీబిపి) రాష్ట్ర ప్రధాన కార్యాలయం, డిఐజీ కార్యాలయ స్ధాపన నిమిత్తం కేటాయించిన 40 ఎకరాల భూమి నిర్వాసితులకు అవసరమైన నష్టపరిహారాన్ని తక్షణం చెల్లించాలని పర్యాటక శాఖ సాంస్కృతిక, యువజన సంక్షేమం క్రీడల శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సోమవారం లేఖ రాశారు. ఎకరానికి రూ ఎనిమిదిలక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని చెల్లించాలని ఆ లేఖలో పేర్కోన్నారు.
44 మంది నుంచి సేకరించిన 34.75 ఎకరాలు, అసైన్డ్ లబ్దిదారు నుంచి సేకరించిన 2.66 ఎకరాలకు పరిహారంగా రూ 3, 05, 66,400 లు పరిహారంగా చెల్లించాల్సి ఉందని మంత్రి ఆ లేఖలో తెలియజేశారు. ఈ లబ్ధిదారులందరూ భీమిలి నియోజకవర్గానికి చెందిన వారు వైఎస్సార్ సీపీ కి బలమైన మద్దతు దారులు ఈ సమస్య ఏడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉందని మంత్రి అవంతి ఆ లేఖలో తెలిపారు. ఈ విషయమై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చి పరిహారం చెల్లించవలసినదిగా ఆయన ముఖ్యమంత్రిని కోరారు.
గ్రేహాండ్స్ శిక్షణా కేంద్రం నిర్వాసితులకు నిధులు అందజేయండి…
భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం జగన్నాధపురం గ్రామంలో గ్రేహాండ్స్ శిక్షణా కేంద్రం నెలకొల్పేందుకు 385 ఎకరాలను
సేకరించడం జరిగిందని, అయితే ఆ భూముల్లో అనధికారికంగా ఆక్రమణలో ఉన్న నిర్వాసితులకు ఎక్స్ గ్రేషియో చెల్లించాలని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహరెడ్డికి రాసిన మరో లేఖలో కోరారు. సిసిఎల్ ఎ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఆక్రమణదారులకు ఎక్స్ గ్రేషియో చెల్లించాలని సిఫార్సు చేసిన విషయాన్ని మంత్రి ఆ లేఖ లో పేర్కోన్నారు. ఇందు నిమిత్తం సి ఎఫ్ ఎం ఎస్ వద్ద నుండి రూ8.7408 కోట్లను మంజూరు చేయాలని అలాగే మిగిలిన రూ 5.184 కోట్ల నిధులను కూడా మంజూరు చేయాలని ఆర్ధికశాఖ, రెవెన్యూ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశామని అవంతి శ్రీనివాసరావు తెలియజేశారు. ఆక్రమణదారులందరూ భీమిలి నియోజకవర్గానికి చెందినవారని వారంతా వైఎస్సార్ సీపీ మద్దతు దారులని ఆయన ఆ లేఖలో పేర్కో న్నారు. గత 11 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్య ను పరిష్కరించేందుకు వీలుగా నిధులు మంజూరు చేయమని ఆర్ధిక, రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు ఇవ్వవలసిం
దిగా మంత్రి అవంతి ముఖ్యమంత్రిని కోరారు. ఇదే విషయమై రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి కి కూడా మంత్రి అవంతి శ్రీనివాసరావు లేఖ రాశారు.