విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలోని మొగల్రాజపురం జమ్మిచెట్టు సెంటర్‌లో ప్రాచీన పద్ధతిలో అందించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన చెక్క గానుగ నూనె వ్యాపార సముదాయాన్ని గౌతం బుద్ధ జ్యోతి ప్రజ్వలన చేసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కాలంలో మార్కెట్లో అందుబాటులో ఉండే నూనెలు, నిత్యావసర సరుకులు కల్తీ అవుతున్న సందర్భంలో ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని ప్రజారోగ్య మే పరమావధిగా ఏడు ప్రాచీన పద్ధతి ప్రకారంగా తయారయ్యే స్వచ్ఛమైన చెక్క గానుగ నూనె తయారు చేస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా వేరుశెనగ, నువ్వుల నూనె, కొబ్బరి నూనె వంటివి కెమికల్స్ లేకుండా ఏ విధంగాను హానికరం కాకుండా పూర్తి సంప్రదాయ పద్ధతిలో గ్రామ ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రతి వెయ్యి రూపాయల ఆర్డర్‌పై ఇంటి వద్దకే డెలివరీ సౌకర్యం కూడా కల్పిస్తున్నామని గౌతమ బుద్ధ తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు గోళ్ళ నారాయణరావు, పలువురు ప్రముఖులు విచ్చేశారు, కార్యక్రమంలో కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …