విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వంట నూనెలను వినియోగదారులకు అందుబాటు ధరలలో లభించేలా రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డా.కె మాధవీలత అన్నారు. బహిరంగ మార్కెట్లలో వంట నూనెలు అధిక ధరలో విక్రయిస్తున్నారని వినియోగదార్ల నుంచి పిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం వంట నూనెల ధరలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా జిల్లాలోని 42 రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లలో వంట నూనెలను సరసమైన ధరలకు విక్రయిస్తునట్లు జాయింట్ కలెక్టర్ అన్నారు. నగరంలోని జాయింట్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖాధికారులతో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు పై జాయింట్ కలెక్టర్ మాధవీలత సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ ఉక్రేయిన్` రష్యా యుద్ధ నేపథ్యంలో బహిరంగ మార్కెట్లలో వంటనూనెలను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వస్తున్న పిర్యాధులను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని 42 రైతుబజార్లలో 49 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. పెద్ద రైతుబజార్లలో రెండేసి కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. వీటితో పాటుగా హౌల్‌సెేల్ ఆయిల్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని గాంథీనగర్, వినాయక గుడి వద్ద ప్రత్యేక కౌంటర్లు పెట్టి విక్రయిస్తున్నట్లు చెప్పారు. అలాగే బుధవారం సాయంత్రంలోపు మరో 6 కౌంటర్ల ద్వారా విక్రయించనున్నట్లు ఆమె చెప్పారు. విక్రయించే ధరలు ఇలా ఉన్నాయి. పామాయిల్ ఆయిల్ రూ.144/`, సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.178/`, గౌండ్‌నెట్ (వేరుశనగ) ఆయిల్ రూ.170/` ధరలుగా నిర్ణయించినట్లు జాయింట్‌కలెక్టర్ అన్నారు. జిల్లాలోని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. నగరంలో రిటైల్, హౌల్‌సేల్ వంటనూనెల అమ్మకదారులు పైన తెలిపిన ధరలను దృష్టిలో పెట్టుకుని విక్రయాలు జరపాలని ఆమె అన్నారు. ఈ సమావేశంలో డిఎస్‌వో కె.వి.ఎస్ యం ప్రసాద్, మార్కెటింగ్ శాఖ డిప్యూటి డైరెక్టర్ దివాకర్ ఉన్నారు.
Tags vijayawada
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …