-పేద బడుగు బలహీన వర్గాలలో ఆర్థిక భరోసా కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న…
-రాష్ట్ర సాంఫీుక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కుల మతాలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ప్రతీ పేదవారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని రాష్ట్ర సాంఫీుక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. విజయవాడ పూర్ణానందం పేట 35వ డివిజన్‌లో 2.27 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన సిసిరోడ్లను, కౌతాసుబ్బారావు పాఠశాలలో అదనపు తరగతిగదులను సోమవారం మంత్రి మేరుగ నాగార్జున, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాస్‌రావులతో కలిసి ప్రారంభించారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేప్పటిన వెంటనే ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను నేరవేర్చడమే కాకుండా కుల మత రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి పేదలందరికి ఆర్థిక భరోసా కల్పించి వారి జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకువస్తున్నారన్నారు. గతంలో విజయవాడ నగరంలో నివసించే ప్రజలు రహదారులు, డ్రైనేజ్‌ల సమస్యలతో సతమతమై దుర్వాసనతో జీవనాన్ని కొనసాగించే వారన్నారు. స్థానిక శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు మంత్రిగా పనిచేసిన రెండున్నర సంవత్సరాల కాలంలో తన నియోజకవర్గాన్నే కాకుండా విజయవాడ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడంలో ఎనలేని కృషి చేశారన్నారు. ప్రభుత్వం నుండి కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేయించి రోడ్లను, డ్రైనేజ్‌లను అభివృద్ధి చేయడమే కాకుండా పేద బలహీన వర్గాల వారు నివసిస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి మోడల్ కాలనీలుగా రూపొందించడం అభినందనీయమన్నారు. గత ప్రభుత్వంలో నాయకులు ప్రజాప్రతినిధులు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల ముందుకు వచ్చేవారని, తమ ప్రస్తుత ప్రభుత్వంలో ప్రతినిత్యం ప్రజల మధ్యే ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కరిస్తున్నామన్నారు. ప్రజల వద్దకే పరిపాలన తీసుకువచ్చి గ్రామ వార్డు సచివాలయల ద్వారా సమస్యలను పరిష్కరిస్తున్నారని ఇది కొత్త ఒరవడికి నాంధి అని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకొవాలని మంత్రి అన్నారు.
స్థానిక శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న జనరంజకమైన పాలన చూడలేక కొందరు విమర్శలు చేస్తున్నారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల వారికి నవరత్నాల పథకాల ద్వారా సంక్షేమ ఫలాలను అందించి వారు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు కృషి చేస్తున్నారన్నారు.35వ వార్డులో 2.27 కోట్ల రూపాయల ఖర్చుతో కౌతాసుబ్బారావువీధి, పింగళ స్వామివీధి, గుర్రాల వారి వీధి, లక్ష్మణరావు వీధి, కర్లపాలెంవారి వీధి, మంచలవారి వీధి, పూనూరువారి వీధి, కాటిరామయ్యవీధులను సిసిరోడ్లగా అభివృద్ధి చేయడంతోపాటు కౌతాసుబ్బారావు పాఠశాలలో అదనపు తరగతి గదులను నిర్మించిన్నట్లు ఆయన తెలిపారు.
కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పునకర్, శాసనమండలి సభ్యులు రుహుల్లా, స్థానిక కార్పొరేటర్ బాలసాని మణిమ్మ, కార్పొరేటర్లు మరుపల్లి రాజేష్, యండి ఇర్ఫాన్, కోటిరెడ్డి, చైతన్యరెడ్డి, యలకల చలపతిరావు, మైలవరపు దుర్గరావు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.