విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన ఆర్జీలను నాణ్యతతో గడువులోగా పరిష్కారించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు నిర్వహించి ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందన ఆర్జీలు రీఓపెన్ కాకుండా పరిష్కరించాలన్నారు. ప్రతీ ఆర్జీన్ని క్షుణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. తిరిగి మరల వస్తున్న ఆర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఆర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలన్నారు. గడువులోగా పరిష్కరించవలసిన ఆర్జీలు ముఖ్యంగా 24, 48 గంటలలో ఏ స్థాయిలోను పెండిరగ్ లేకుండా చూడాలన్నారు. నేటి వరకు 192 వివిధ శాఖలకు సంబంధించి ఆర్జీలు పరిష్కరించవలసినవి ఉన్నాయని ఆయా శాఖలు వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు ప్రతీ ఒక్కరూ స్పందన పోర్ట్‌ల్‌ను ఒపెన్ చేసి నమోదు అవుతున్న ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. రెవెన్యూ, సర్వే, పెన్షన్లు, రెషన్, ఇళ్ల స్థలాల వంటి ఆర్జీలు ఎక్కువగా నమోదు అవుతున్నాయని ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. బియాండ్ ఎస్‌ఎల్‌ఏలోకి ఏ ఒక్క దరఖాస్తు వెళ్లకుడాదన్నారు. స్పందన ఆర్జీల పరిష్కారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు సమస్యలను పరిశీలించి నిర్ణిత కాల పరిమితిలోగా పరిష్కరించాలన్నారు. సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుని కాలయాపన లేకుండా పరిష్కారం చూపాలన్నారు. స్పందన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం కూడదని కలెక్టర్ అధికారులను కోరారు.
స్పందన ద్వారానే కాకుండా గ్రామ, వార్డు సచివాలయాలు, 1902 కాల్ సెంటర్, మొబైల్ యాప్, వెబ్ అపిలికేషన్ ద్వారా కూడా ప్రజలు ఆర్జీలను సమర్పిస్తారని, వాటిని కూడా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కారం చూపాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ డిల్లీరావు ఆదేశించారు.
స్పందనలో వచ్చిన ఆర్జీలు…
గంపలగుడెం మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన ఆలపాటి ఉమామహేశ్వరరావు ఆర్జీ ఇస్తూ ఇటీవల బారీ వర్షాలకు చిన్ననీటి పారుదల శాఖకు చెందిన చెరువు కట్ట తెగి బలహీనంగా ఉందని త్వరితగతిన చెరువు గండి పడకుండా కట్టను పటిష్ఠం చేయాలని…
కంచికచర్ల మండలం మోగులూరు గ్రామకాపురస్థులు ఆర్జీ సమర్పిస్తూ 1993 సంవత్సరంలో కృష్ణానదీకి వరద వచ్చినప్పుడు ముంపుకు గురి అయిన కుంటుంబాల వారికి 430 ఇళ్ల పట్టాలు ఇచ్చారని, అయితే గృహాలు నిర్మించుకునేందుకు ఆర్థిక స్థొమత తమకు లేనందున జగనన్న కాలనీ నిర్మాణాలలో తమ గృహాలను చేపట్టాలని కోరారు.
విజయవాడ గుణదలకు చెందిన బి మణిక్యం, అంబాపురంకి చెందిన ఉండి వెంకటేశ్వరమ్మ, గవర్నపేట కు చెందిన ఎ అశోక్ కుమార్ ఆర్జీలు ఇస్తూ తమకు ఇంటి స్థలం, గృహాలను మంజూరు చేయాలని కోరారు.
స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ కుమార్, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్, జడ్పి సిఇఓ సూర్య ప్రకాష్, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News