-ఈనెల 28 న తెనాలి డి.ఎస్.ఏ మిని స్టేడియంలో ఎంపిక
-20 మంది క్రీడాకారులతో తొలి బ్యాచ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, తెనాలి డబల్ హార్స్ సంయుక్తముగా తెనాలిలో రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ బాలురు అకాడమి ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 20 మంది బాలురకు ప్రవేశాలు కల్పించేందుకు మే 28 న రాష్ట్ర స్థాయి ఎంపికలు చేపట్టారు. ఈ ఎంపికలను తెనాలి డి.యస్.ఏ మిని స్టేడియం లో నిర్వహించనున్నారు. ఎంపికయిన క్రీడాకారులకు జూన్ నుంచి శిక్షణ మొదలవుతుందని శాప్ యండి యన్ ప్రభాకర రెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. రాష్ట్రములో ఉన్నటువంటి అర్హత కలిగిన 14 నుండి 18 సంవత్సరాల లోపు క్రీడాకారులందరూ, ఎంపిక ప్రక్రియ జరుగు ప్రదేశానికి ఉదయం 8 గంటలకు సంబంధిత ధృవపత్రాలతో అనగా ఆధార్ కార్డు, జనన ధృవీకరణ పత్రం, ఐదు పాస్-పోర్ట్ సైజు ఫొటోలు, డాక్టర్ చే నిర్ధారించబడిన ఫిట్‌నెస్ సర్టిఫికేట్, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి పోటీలలో పొందిన సర్టిఫికెట్లు తీసుకురావలెను. మరిన్ని వివరాలకు ఈ క్రింది ఫోన్ నెంబర్‌లను సంప్రదించగలరు. కాంటాక్ట్ నెంబర్: +91-9866134016, +91-9494833311.