-కార్యదర్శి ఆర్. నరసింహారావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని రెసిడెన్షియల్ మైనారిటీ జూనియర్ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కొరకు అర్హత గల మైనారిటీ విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నామని గుంటూరు లోని ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్. నరసింహారావు ఒక ప్రకటనలో తెలిపారు. 2022 సంవత్సరంలో 10వ తరగతిలో పొందిన మార్కుల ప్రాతిపదికన ఎం.పీ.సి., బై.పీ.సీ. మరియు సి.ఇ.సి. లలో ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తున్నామని ఇంగ్లీష్ మరియు ఉర్దూ మీడియంలలో బోధన ఉంటుందని అయన అన్నారు. రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో కర్నూల్, గుంటూరు, చిత్తూర్ జిల్లాలోని వాయల్పాడులో రెసిడెన్షియల్ మైనారిటీ జూనియర్ కళాశాలలు ఉన్నాయని, వీటిలో ఇంటర్మీడియేట్ ప్రవేశాలు కొరకు 345 ప్రవేశ ఖాళీలు అందుబాటులో ఉన్నాయని కార్యదర్శి తెలిపారు. మే 30వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించ వచ్చునని, దరఖాస్తు, కళాశాల వివరాలు, ఇతర సమాచారం https://aprs.apcfss.in వెబ్ సైట్ లో పొందవచ్చునన్నారు. ఇతర వివరాలు కొరకు ఆఫీస్ పనిచేయు వేళలలో (ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5-30 గంటల వరకు) 9676404618 మరియు 7093323250 సెల్ ఫోన్ నెంబర్ లకు ఫోన్ చేసి వివరాలు పొందవచ్చునని కార్యదర్శి ఆర్. నరసింహారావు అప్రకటనలో కోరారు.