Breaking News

ప్రజా సమస్యల ఆర్జీలు ఏస్థాయిలోను పెండింగ్‌ ఉండరాదు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల ఆర్జీలు ఏస్థాయిలోను పెండింగ్‌ ఉండరాదని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. గడువులోగా, గడువుదాటిన ఆర్జీల పరిష్కారం పై జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు బుధవారం జాయింట్‌ కలెక్టర్ల, మున్సిపల్‌ కమీషనర్‌, డిఆర్‌వో, డిసిపి, డివిజన్‌ స్ధాయి అధికారులు, డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్‌, తదితర శాఖల అధికారులతో నగరంలోని కలెక్టర్‌ కార్యాలయం నుండి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం స్పందన, ఏపి పోర్ట్‌ల్‌, సచివాలయాలు, ఏపి సేవ సర్వీసెస్‌ డాష్‌బోర్డు ద్వారా ఆర్జీలను సమర్పిస్తారన్నారు. ఆయా శాఖలు సంబంధిత ఆర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. జిల్లాలోని 20 మండలాలలో నేటి వరకు 12,050 ధరఖాస్తులు రాగా వీటిలో 8,328 ధరఖాస్తులు గడువులోగా పరిష్కరించడం జరిగిందని, గడువు దాటిన వాటిలో 3,013 ధరఖాస్తులు పరిష్కరించగా, మిగిలిన 709 వాటిని త్వరితగతిన పరిష్కరించి ఆర్జీలు పెండిరగ్‌ ఏస్థాయిలోను లేని జిల్లాగా నమోదు చేయాలని కలెక్టర్‌ కోరారు. వచ్చిన ఆర్జీలను ఎప్పటికప్పడు సంబంధిత శాఖల అధికారులు నాణ్యతతో పరిష్కరించాలన్నారు. పరిష్కారం కాని వాటికి తగిన కారణాలను ఆర్జీదారులకు తెలపాలన్నారు. ఏ ఒక్క ఆర్జీ రీఒపెన్‌ కాకుడదన్నారు. ప్రతీ ఆర్జీని పరిశీలించి నాణ్యతతో నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. ప్రతీ ధరఖాస్తును తేలికగా తీసుకోకుండా క్షేత్రస్థాయిలో పరిష్కారించాలని ఆర్జీదారుడు సంతృప్తి చెందేలా ఎండార్సెమెంట్‌ ఇవ్వాలన్నారు. ప్రధానంగా వచ్చే రేషన్‌కార్డులు, పెన్షన్‌, ఇళ్లస్థలాలు, గృహానిర్మాణాలు వివిధ ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫీకేట్లకు సంబంధించిన ధరఖాస్తులను సకాలంలో పరిష్కారం చూపాలని కలెక్టర్‌ అన్నారు. టెలికాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపుర్‌ అజయ్‌, మున్సిపల్‌ కమీసనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పునకర్‌, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌, డిఆర్‌డిఏ పిడి ఎన్‌ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *