Breaking News

క్షేత్రస్థాయిలో ని వివిధ శాఖల అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను నూరు శాతం సాధించాలి… : కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించే లక్ష్యాలపై రాష్ట్ర స్థాయి అధికారులు వారం వారం సమీక్షిస్తూ, ప్రగతి సాధనే దిక్సూచి గా పేర్కొనడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీ లత పేర్కొన్నారు.

పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, జగనన్న స్వచ్చ సంకల్పం , ఉపాధిహామీ, వైఎస్ఆర్ జల కల , జల్ జీవన్ మిషన్ , పన్నుల వసూలు (పన్నులు & నాన్ ట్యాక్స్‌లు) , నాడు నేడు పై పాఠశాల విద్య స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్, ద్వారా మన బడి ఫేజ్-2 , మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ (గోడౌన్) నిర్మాణం పై మార్కెటింగ్ కమిషనర్ పి ఎస్. ప్రధ్యున్మ ఆయా శాఖల ప్రగతి పై కలెక్టర్లు మరియు జాయింట్ కలెక్టర్ లతో గురువారం సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో ఉపాధి హామీ పథకం లో భాగంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు 29,37,000 పనిదినాలు, లక్ష్యం కాగా నిన్నటికి 11,31,374 పనిదినాలు కల్పించామన్నారు. ప్రస్తుతం రబీ సీజన్ ఊడ్పులు పూర్తి అయినందున, లక్ష్యాలను సాధించడానికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయ్యాడం జరిగిందన్నారు. సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంతున్నట్లు కలెక్టర్ వివరించారు. నాడు నేడు కింద పాఠశాలలో చేపడుతున్న పనులపై కలెక్టర్ మాధవీలత వివరాలు తెలుపుతూ, 412 స్కూల్స్ పరిధిలో 511 పనులకు సంబంధించి సిమెంట్, ఇసుక సేకరణ పూర్తి చేశామన్నారు. నాడు నేడు కింద 96 శాతం పనులకు సంబందించిన కార్యాచరణ పూర్తి చేసినట్లు వివరించారు. ఇప్పటికే 79 స్కూల్స్ సంబంధించి రూ.11 కోట్ల నిధులు విడుదల అయ్యాయన్నారు. ఆయా పాటశాలల్లో రివాల్వింగ్ ఫండ్ సమకూర్చుకున్నట్లు తెలిపారు. మల్టీ పర్పస్ ఫెసిలిటీ కేంద్రాల (గోడౌన్) ఏర్పాటు కోసం 43 గోడౌన్ నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, 42 కి ఆమోదం పొందడం జరిగిందన్నారు. వీటికి సంబంధించి 16 చోట్ల పనులు ప్రారంభించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. స్థలాలకు సంబందించిన ఇబ్బందుల ను అధిగమించి , ఆయా గో డౌన్ ఏర్పాటుకు అనుకూలంగా స్థల సేకరణ జరుగుతున్నట్లు తెలిపారు.

ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ సిహెచ్, శ్రీధర్, డ్వామా పీడీ పి. జగదాంబ, డిపివో జె. సత్యనారాయణ, ఈఈ పంచాయతీరాజ్ ప్రసాద్, డిసిఓ ఎంవివి నాగభూషణం, ఎడి మార్కెటింగ్ వెంకటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *