విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరులోని హ్యాపీ కేర్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో సీనియర్ పాత్రికేయులు విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు టెలికం సలహా కమిటీ సభ్యులు నిమ్మ రాజు చలపతిరావు 61 వ జన్మదిన వేడుకలు ఈ నెల 26వ తేదీన ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు, వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ నాలుగు దశాబ్దాలుగా పాత్రికేయ వృత్తిలో నిమగ్నమై మంచి పాత్రికేయులుగా నిమ్మ రాజు చలపతిరావు అంచలంచే లుగా ఎదుగుతూ ఆంధ్రభూమి బ్యూరో చీఫ్ గా పదవి విరమణ చేయడం అభినందనీయమన్నారు వేలాది జర్నలిస్టుల సమస్యల పరిష్కరించడం కోసం జర్నలిస్టు సంఘాల్లో చురుకైన పాత్ర పోషించారన్నారు వృద్ధులు, అనాధల మధ్య 61వ జన్మదినాన్ని జరుపుకోవడం హర్షణీయమన్నారు ఈ కార్యక్రమంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ విజయవాడ అధ్యక్ష, కార్యదర్శులు, చావా రవి, కొండ సురేష్, దీక్షితా ఫౌండేషన్ వ్యవస్థాపకులు నిమ్మకాయల సత్యనారాయణ, కృష్ణ,వార్తా ప్రభ సంపాదకులు శ్రీరామ్ యాదవ్, APUWUJ గుంటూరు జిల్లా గౌరవ అధ్యక్షులు ఏపీ మోహన్, రాంబాబు తదితరులు నిమ్మ రాజు చలపతిరావు ను సత్కరించి ప్రసంగించారు.
Tags vijayawada
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …