-అజాదికా అమృత్ మహోత్సవం కార్యక్రమం
-జిల్లాలో గల 1,17,122 మంది రైతు కుటుంబాలకు రు.23.42 కోట్ల మేర ప్రయోజనం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పేదరికం ఉండకూడదనేది ప్రధానమంత్రి ఆశయం అని అందులో భాగంగా దేశంలోని 20 లక్షల కుటుంబాలకు రూ.ఒక లక్ష 80 వేల కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూర్చారని కేంద్ర నైపుణ్య అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.
మంగళవారం సిమ్లా నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ ద్వారా ముఖాముఖి కార్యక్రమంలో స్థానిక ప్రవేటు సమావేశ మందిరం నుంచి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, పిఎం కిసాన్ యోజన పథకం గరిభ్ సమ్మేళనం లో దేశంలో 10 కోట్ల పైగా రైతుల ఖాతాకు రూ.21 వేల కోట్ల రూపాయల ను జమచెయ్యడం జరిగిందన్నారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పుట్టినరోజు వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వంతంత్రం వొచ్చి 75 సంవత్సరాలు వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంలో అజాదికా అమృత్ మహోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. మంత్రి పుట్టినరోజు వేడుకలలో రాజమహేంద్రవరం ఎంపి మార్గని భరత్ రామ్ ఆధ్వర్యం లో కేకు కట్ చేశారు. మీ సమక్షంలో పుట్టినరోజు జరుపు కోవడం ఒక ప్రత్యేకత గా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనకు కేంద్రం కట్టుబడి ఉన్నామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార పౌర సంబంధాల, సినిమాటోగ్రఫీ మంత్రి సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ ధన్యావాదాలు తెలిపారు. స్వాతంత్ర ఫలాలు ముఖ్య ఉద్దేశ్యం ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదవారికి అందించడం కోసం అన్నారు. ప్రజలు ఎవ్వరూ పేదరికంలో పుట్టాలని అనుకొరన్నారు. పేదరిక నిర్మూలన పథకాలు ఎలా అమలు జరుగుతాయని, చూడల్సి ఉందన్నారు. ఈ వ్యవస్థ లో అమలులో ఎక్కడో లోపం ఉందన్నారు అవి అర్హులకు చేరాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగ్మోహన్ రెడ్డి పేదవారి కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకుని వొచ్చారని పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ, పథకాలు ప్రయోజనం కలగాలంటే దరఖాస్తు చేసుకునే అవసరం లేదని, అర్హత ఒక్కటే ప్రామాణికంగా ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలు చేస్తున్నదని తెలిపారు. రైతు ను ఆదుకునేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒక అడుగు వేస్తే, తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ.. కేంద్రం ఆరు వేలు ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం 7500 కలిపి రూ.13500 ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. పంట వేసే ముందే రైతు భరోసా మొత్తాన్ని రైతు ఖాతాల్లోకి జమ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వాలు ముందుగా సహాయం చేస్తాయి అని ఏ రైతు ఎప్పుడు ఆలోచన చెయ్యలేదని పేర్కొన్నారు. 44,45,000 వేల మంది రైతులు రైతు భరోసా ద్వారా ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. విద్య, వైద్య, ఇల్లు ప్రతి వారు కోరుకునే మూడు ప్రధాన అంశాలన్నీ పేర్కొన్నారు.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వొచ్చకా రాష్ట్రంలో 33 లక్షలు పైగా కుటుంబాలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి 33 లక్షల మందికి ఇల్లును అందించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11 మెడికల్ కళాశాలుండగా మరో నూతనంగా 16 మెడికల్ కళాశాలను నిర్మిస్తున్నారు. ఆరోగ్య పరంగా ముఖ్యమంత్రి ప్రజలకు భరోసా కల్పించారు. రాష్ట్రంలో 33 లక్షలు 70 వేల మంది మహిళలు పేరున ఇంటి పట్టాలు అంద చేశాం, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
57,303 ఇళ్లను రు . 1,031 కోట్లతో గృహ నిర్మాణం చేపట్టామన్నారు. త్రాగునీటి అవసరాలు తీర్చే ప్రయత్నం లో జల జీవన్ మిషన్ రక్షిత నీటి సంకల్పం 50 : 50 శాతం శాతంతో అమలు చేయడం జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనకు, పిల్లల్లో పౌష్టికాహార లోపం లేకుండా పోషకాహరం అందించే సంపూర్ణ ఆహార పథకం అమలు చేస్తున్నామన్నారు. పథకాలు అమలు లో ప్రధానమంత్రి సహకారం పొందుతున్నామన్నారు. వారితో సత్సంబంధాలు కొనసాగిస్తున్న మని తెలిపారు. 2019 నుంచి రాష్ట్రంలో 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ తదితర మహిళలకు నాలుగు విడతల్లో చేయూత ద్వారా ఆర్థిక భరోసా ఇచ్చామన్నారు.
రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మర్గాని భరత్ రామ్ మాట్లాడుతూ, అజాదికా అమృత మహోత్సవం అంటే స్వతంత్రం వొచ్చి 75 సంవత్సరాల కాలం పూర్తి చేసుకుని అమృత్ కాలంలోకి అడుగు పెట్టామని ప్రధానమంత్రి చెపుతుంటారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు మరింత అభివృద్ధి చేసి, ముఖ్యమంత్రి రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుందన్నారు. పిల్లల్లో పౌష్టికాహరం అందించేందుకు 25 గుడ్లు, చిక్కులు వంటివి ఇవ్వడం జరుగుతోందన్నారు. అమ్మఒడి, చేయూత, పెన్షన్ లు , ఇండ్ల స్థలాలు ఇచ్చి ఆదుకుంటోందని తెలిపారు. దిగుమతులు తగ్గించు కోవాలి, ఎగుమతులు పెంచుకోవాలి. సౌరశక్తి వినియోగం పెంచుకోవాలని తెలిపారు.
శాసన జక్కంపూడి రాజా మాట్లాడుతూ, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడానికి సరైన సరైన నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ లలో వాలంటీర్లను తీసుకొచ్చి పరిమిత కాలం లోనే సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలను ప్రజలకు చేరవేయడం జరుగుతోందన్నారు. సంక్షేమ పథకాలు కులాలు మతాలు పార్టీలు రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అమలు చేస్తున్నామన్నారు. కేంద్రం విభజన చట్టంలో చేసిన హామీలను అమలు చేయాలని ఆయన కోరారు.
కలెక్టర్ డా. కే.మాధవీలత మాట్లాడుతూ, గరిబ్ కళ్యాణ్ యోజన అనేక పథకాలు ద్వారా ప్రయోజనం చేకూర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం జరుగుతోంది. రైతు భరోసాగా రూ 13500 లు అందచెయ్యడం జరుగుతోందన్నారు. జూన్ తొలకరి నాటికి నాట్లు వెయ్యడానికి సిద్దం చేశామన్నారు. అవాస్ యోజన, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు ద్వారా ప్రయోజనం కలుగచేస్తున్నామని, లబ్దిదారులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్వచ్ఛ గ్రామాలకు శ్రీకారం చుట్టి, ప్రతి ఊరిలో డంపింగ్ యార్డు లను ఏర్పాటు చేస్తూ, గ్రామాల్లో పరిశుభ్రత పాటించడం జరుగుతోంది. పోషణ అభియాన్ పథకం ద్వారా పౌష్టికాహరం అందజేస్తూ స్త్రీ గర్భం దాల్చిన నాటి నుంచి పిల్లలు స్కూల్ కి వెళ్ళే వరకు పరిరక్షణ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పధకం ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో గల 1,17,122 మంది రైతు కుటుంబాలకు రు.23.42 కోట్ల రూపాయల జమ కానున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత పేర్కొన్నారు. ఈ పంట నమోదు లో ఈ-కె.వై.సి. తప్పనిసరి అన్నారు. ఇ- పంటలో నమోదు కాని అర్హత గల రైతులు తప్పనిసరిగా ఆధార్ తో చరవాణి ఆధారిత ద్వారా కానీ బయో మెట్రిక్ ఆధారముగా గాని ఈ-కె.వై.సి. చేయించు కోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఈ పంట నమోదు లో ఈ-కె.వై.సి. చేయించుకున్నవారిని రాష్ట్ర ప్రభుత్వం వారు పి.యం.కిసాన్ ఈ-కె.వై.సి. కి జత చేసియున్నారని తెలిపారు.
లబ్దిదారుల స్పందన
గోపాలపురం – రైతు తిరుమల రాజేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందచేస్తున్న కిసాన్ యోజన పథకం సహాయంతో పెట్టుబడి పెట్టి ఫామయిల్ పంట సాగు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన మంత్రి కిసాన్ యోజన సహాయం రూ.6 వేలుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించిన రూ.7500 ఎంతగానో ఉపయోగ పడిందని పేర్కొన్నారు.
రాజానగరం కు చెందిన కే.రాజ్యలక్ష్మీ మాట్లాడుతూ, గర్భిణీ గా ఉన్న ఆరో నెలనుంచి హేమోగ్లోబిన్ శాతం పెరిగేందుకు పరీక్షలు నిర్వహించి, అంగన్వాడి కేంద్రం ద్వారా రక్త హీనత రాకుండా బెల్లం, సజ్జ, జొన్న పిండి, రాగులు ఇచ్చి అవగాహన కల్పిస్తూన్నారని తెలిపారు . పేదలకు అండగా నిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా కలెక్టర్ కె మాధవిలత, సి టి ఆర్ ఐ ఐ డైరెక్టర్ డి. దామోదర్ రెడ్డి , రుడాచైర్పర్సన్ ఎం . షర్మిలారెడ్డి, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, ఎమ్ ఎల్ ఏ జక్కంపూడి రాజా, కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్, ప్రజా ప్రతినిదులు సోము వీర్రాజు,
అధికారులు, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.