మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సాగునీటి విడుదల చేస్తున్న నేపధ్యంలో ఆయకట్టు శివారు ప్రాంతాలకు సాగునీరు చేరేలా కాలువల నిర్వహణ సక్రమంగా ఉండాలని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి , మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) పాల్గొన్న ఈ రివ్యూలో పలు విషయాలు అధికారులతో చర్చించారు. ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఎదురై ఎగువ ప్రాంతం నుంచి నీరు విడుదల కాకపోతే, అవసరమైతే ఇండెంట్ పెట్టి పట్టిసీమ నుంచి కావాల్సిన నీటిని తీసుకొనేలా అప్రమత్తంగా అధికారులు ఉండాలని కలెక్టర్ సూచించారు. 22 పంపులు, రెండు స్టాండ్ బై పంపులు నిర్వహణ, సామర్ధ్యం తీరు గురించి కలెక్టర్ అడిగి తెలుసుకొన్నారు. అలాగే ఐడిసి పథకాలు వాటి వివరాలు, అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ 17 స్కీమ్ ల పరిస్థితి స్థితిగతులను గూర్చి ఇరిగేషన్ అధికారులను అడిగి కలెక్టర్ తెలుసుకొన్నారు. కాలువల మీద కొనసాగుతున్న సిమెంట్ పనులు ఏమైనా ఉంటే త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. కృష్ణా డెల్టా పరిధిలో 2022-23 సంవత్సరం ఖరీఫ్ లో వివిధ ప్రధాన కాలువల కింద 5.70 లక్షల ఎకరాల ఆయకట్టు నిర్దేశించగా అందులో 5.25 లక్షల ఎకరాల సాగుకు నీరు ఎంతో కీలకమని ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. ఖరీఫ్, రబీ సీజన్లు కలిపి కృష్ణా డెల్టాకు 146 టీఎంసీల సాగునీరు అవసరమవుతుందని చెబుతూ, ఒక్క ఖరీఫ్ కు మాత్రమే 84 టీఎంసీల సాగునీరు కాలువలకు నీరు విడుదల సమయంలో కాలువలలో తూడు, గుర్రపుడెక్క తదితర నీటి ప్రవాహ అడ్డంకులను అధిగమించేలా చర్యలు చేపట్టాలని,ఇరిగేషన్ అభివృద్ధి పనులకు కొందరు టెండర్లు వేస్తారు కాని పనులు చేయరని అదేవిధంగా పూడికతీత, గేట్ల మరమ్మతులు, రిటైనింగ్ వాల్స్ నిర్మాణ పనులు శాసనసభ్యులు పేర్ని నాని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పట్టిసీమ డి ఇ కె.వి. ప్రసాద్, ఐడిసి డి ఇ ప్రభాకర్ శర్మ, ఇరిగేషన్ ఇంజినీర్ ( డ్రైనేజ్) గోపాల్ , ఇరిగేషన్ డి ఇ మురళీకృష్ణ, డ్రైనేజ్ డి ఇ మోహన్ తదితర ఇంజనీర్లు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …