Breaking News

అర్హలందరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని మరో ముప్పైఏళ్లు ముఖ్యమంత్రి గా కొనసాగే విధంగా ప్రజలు దీవించాలని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని స్థానిక డివిజన్ ఇంచార్జ్ కొత్తపల్లి రజని తో కలిసి 8వ డివిజన్ 63సచివాలయ పరిధిలోని ఈస్రాయిల్ పేట నందు ఇంటి ఇంటి కి వెళ్లి ప్రజలకు అందే సంక్షేమ పథకాలు లబ్దిదారులకు వివరించి, అదేవిధంగా స్థానిక ప్రజల సమస్యలు ను సంబంధిత సచివాలయం సిబ్బంది మరియు మున్సిపల్ అధికారులు ద్వారా వివరాలు తెలుసుకుని సాధ్యమయినంత త్వరలో పరిష్కరించి వారికి అందేలా చర్యలు చేపట్టాలని అవినాష్ కోరారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బుదవారం నాడు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా గడచిన మూడేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి, చూపిన సంక్షేమం గడప గడపకు వివరించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ ఎక్కడా ఏ ముఖ్యమంత్రి అమలు జరుపని సంక్షేమం, గ్రామస్వరాజ్యం చేసి చూపుతున్న మన ముఖ్యమంత్రి ఒక్కరే అన్నారు. వయసుకు చిన్నవాడైనా పెద్ద మనసున్న మారాజు జగనన్న అన్నారు.ఎన్నికల మేనిఫెస్టో ను చెప్పింది చెప్పినట్టు అమలు చేస్తూ..తను ప్రకటించిన నవరత్నాలే కాకుండా 33 సంక్షేమ పథకాలు దళారీల ప్రమేయం లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్న నాయకుడు జగనన్న అన్నారు. ముఖ్యంగా గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కులం, మతం, వర్గం, వర్ణం, ప్రాంతం, పార్టీ అనే వివక్షత చూపని, దేశానికే ఆదర్శంగా జగనన్న నిలిచారని అన్నారు.అనంతరం స్థానిక కుటుంబాలను వరుసక్రమంలో కలిసి వారు ప్రభుత్వం నుండి అందుకున్న సంక్షేమ పథకాల వివరాలను ఆరాతీశారు.ఈ కార్యక్రమంలో కార్పరేటర్లు అంబేద్కర్, అమర్, వైసిపి నాయకులు యలంచిలి జయ, పొట్లూరి రవి, బహదూర్,ముక్కు వెంకటేశ్వర రెడ్డి, ఈశ్వర ప్రసాద్, గల్లా రవి, రాజ్ కమల్ మరియు స్థానిక పెద్దలు పాల్గొన్నారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *