-గోదావరి నది కి పూజలు చేసి నదిలో పూలు, పట్టువస్త్రాలు వదిలిన మంత్రులు
-ఖరీఫ్ పంట వేసేందుకు రైతాంగం సన్నద్దం కావాలి..
-ఎరువులు,విత్తనాలు ఆర్బీకేలు ద్వారా అందుబాటులో ఉంచాం..
-రాష్ట్ర మంత్రులు.. ..అంబటి రాంబాబు..చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్దితో పనిచేస్తుందని, తుఫానులు,వరదలువంటి ప్రకృతివైపరీత్యాల వలన పంట నష్టపోకుండా ముందుగానే రైతుకు పంట చేతికొచ్చే విధంగా జూన్ 1 వ తేదీనే కాలువులకు సాగు నీటిని విడుదల చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం ఉదయం గోదావరి పరివాక ప్రాంతాల్లో గల కాలువలకు విజ్జేశ్వరం, బొబ్బర్లంక, ధవళేశ్వరం వద్ద గోదావరి బ్యారేజ్ స్లూయిజ్ నుండి మంత్రులు అంబటి రాంబాబు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత ఇతరప్రజా ప్రతినిధులు అధికారులు పూజాది కార్యక్రమాలను నిర్వహించి లాక్ ల నుంచి కాలువలకు సాగునీటిని విడదల చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు డా.కె.మాధవీలత, పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్, వంగాగీత, జెడ్పీ చైర్మన్ విప్పర్తివేణుగోపాలరావు, శాసనసభ్యులు జక్కంపూడి రాజా, జి.శ్రీనివాస నాయుడు, మాజీ మంత్రి చెరుకువాడశ్రీ రంగనాధరాజు, రాపాక వరప్రసాద్, రుడా చైర్మపర్సన్ ఎం. షర్మిళా రెడ్డి,ఈఎంసీ సుధాకర్, జలవనరుల శాఖ ఎస్ఈ రాంబాబు, స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ ఖరీఫ్ పంట సాగుకు ముందుగానే తూర్పు, సెంట్రల్ ,పశ్చిమ డెల్టా కాలువలకు సాగునీటి విడుదల చేస్తున్నందున రైతాంగం ఖరీప్ పంట వేసేందుకు సన్నద్దం కావాలన్నారు. రాష్ట్రంలో పులిచింతల, నాగార్జునసాగర్ వంటి వివిధ జలాశయాల్లో పుష్కలంగా నీరు ఉందన్నారు. నవంబరు, డిశంబరు మాసంలో వచ్చే తుఫానులు వరదలు వంటి ప్రకృతి విపత్తుల నుంచి పంట నష్టపోకుండా ముందుగానే కాలువలకు సాగు నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ఇప్పటికే వ్యవశాయశాఖ రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతాంగాని అందుబాటులో విత్తనాలు , ఎరువులను అందుబాటులో ఉంచిందన్నారు. ఇప్పటికే ఇరిగేషన్, అగ్రికల్చర్ ఎడ్వజరీ బోర్డు సమావేశాలను నిర్వహించడం జరిగందన్నారు. పోలవరం ప్రాజెక్టు త్వరిత గతిన పూర్తిచేస్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదం వలన పోలవరం ప్రోజెక్టు డయాఫ్రంవాల్ దెబ్బతిన్నదని, ఇది చారిత్రాత్మక తప్పిదం అన్నారు. గోదావరి డెల్టాప్రాంతంలో 10.13 లక్షల ఎకరాల ఆయకట్టు సాగునీటిని అందించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా పశ్చిమ డెల్టాకు 2.81 లక్షల ఎకరాలు, తూర్పు డెల్టాకు 5.30 లక్షల ఎకరాలు, సెంట్రల్ డెల్టా కు 2.02 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలుమేరకు ఈఏడాది ఖరీఫ్ పంటకు 15 రోజులు ముందుగానే కాలువలకు సాగునీటిని విడుదల చేశామన్నారు.
జిల్లా ఇన్ఛార్జి మరియు బీసీ సంక్షేమం, సమాచార పౌరసంబంధాలు, సీనిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రెండు దశాబ్ధాల అనంతరం నేడు తూర్పు, సెంట్రల్, పశ్చిమ డెల్టాలకు సాగునీటిని జూన్ 1 వ తేదీనే విడుదల చేయడం శుభపరిణామం అన్నారు. దీని వలన అక్టోబరు, డిశంబరు మాసాల్లోవచ్చే తుఫానులు పంట నష్టాలు జరగకుండా ముందుగానే పంట చేతి కొస్తుందన్నారు. రైతాంగానికి ముందుగానే సాగునీటిని అందిస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని రైతాంగం స్వాగతిస్తున్నారన్నారు. రైతులు సౌభాగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ ప్రదానలక్ష్యమని ఈమేరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ మెలకులతో పాటు ఎరువులు,విత్తనాలు అందుబాటులో సిద్దంచేశారన్నారు. సాగునీరు ముందుగానే అందిస్తున్నందున రైతాంగం సకాలంలో నాట్లువేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని మంత్రి రైతాంగాన్నికోరారు.
రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ,అగ్రవర్ణాల పేదల అభివద్దికి రక్షణ కవచంగా అనేకసంక్షేమం పథకాలను అమలు చేస్తుందన్నారు. బలహీన వర్గాలైన బీసీలకు రాష్ట్రస్థాయిలో కార్పోరేట్ పదవులను కల్పించి సామాజిక న్యాయం చేసి వారి కనీస అవసరాలను ప్రభుత్వం పట్టించుకుంటుందన్నారు. తొలుత కాటన్ బ్యారేజ్ చేరుకున్న మంత్రులు దివంగత ముఖ్యమంత్రి డా. రాజశేఖరరెడ్డి విగ్రహానికి, గోదావరి ఆనకట్ట నిర్మాణ పితామహుడు సర్ ఆర్థర్ కాటన్ దొర విగ్రహానికి జలవనరుల శాఖమంత్రి అంబటి రాంబాబు,జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ,పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, జిల్లా కలెక్టరు డా.కె.మాధవీలత, శాసనసభ్యులు జక్కంపూడి రాజా, రుడా చైర్మన్ యం.షర్మిళా రెడ్డి, ఆర్డీవో ఏ.చైత్రవర్శిని, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఇరిగేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, జిల్లా ఇన్చార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, శాసనసభ్యులు, ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులతో జిల్లాలో జలవనరుల శాఖ ద్వారా చేపట్టిన పలు అంశాల పై సమీక్షించారు.