రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విచ్చేశారు. ఖరీఫ్ సీజన్లో సాగు కోసం తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టా కి నీరు విడుదల కోసం నగరంలో బస చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ను బుధవారం ఉదయం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవిలత అందించారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఉన్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ను బుధవారం మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవిలత పుష్పగుచ్చాన్ని అందచేశారు.
Tags rajamendri
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …