-ప్రతి ఒక్కరూ 10 మొక్కలు వేసి మరో పది మంది కి చెప్పండి..
-కలెక్టర్ డా. కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రెడ్ క్రాస్ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో 10,000 మొక్కలు నాటి సంరక్షణ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయం అని రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ డా. కె. మాధవి లత పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ లో మొక్కలు నాటే గోడ ప్రతిని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో సామాజికసృహతో చేపట్టే రెడ్ క్రాస్ కార్యక్రమలు అత్యంత చిత్తశుద్ధితో చేపట్టాలన్నారు. రక్త దానం, ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే ఒక మంచి కార్యక్రమం చేపట్టడం పట్ల నిర్వాహకులను అభినందించారు. భవిష్యత్తు లో యువతను భాగస్వామ్యం చేసే ఇటువంటి కార్యక్రమాలను నగర పౌరులను, వివిధ సంస్థలను కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. అంతేకాకుండా రెడ్ క్రాస్ రాజమండ్రి కార్యాలయాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ వై మధుసూదన్ రెడ్డి , కమిటీ సభ్యులు నరేష్ కుమార్ రాజు పాల్గొన్నారు.