Breaking News

మంచినీటి పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని కొండ ప్రాంతంలో నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం 2వ డివిజన్ కార్మికనగర్,యానాం వారి వీధి నందు స్థానిక డివిజన్ కార్పొరేటర్ అంబడపూడి నిర్మలా కుమారి ఆధ్వర్యంలో 36 లక్షల రూపాయలు, బెత్లెహం నగర్ నందు 46 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మంచినీటి పైప్ లైన్ నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి అవినాష్ ముఖ్య అతిథిగా హాజరై పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదట నుండి కూడా ఈ కొండ ప్రాంత వాసులు మా వైసీపీ పార్టీకి,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి మద్దతు గా నిలిచారని ఆ కారణంగా గత టీడీపీ ప్రభుత్వం లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కోట్ల రూపాయలు వెచ్చించి నూతన మెట్లు మార్గాలు, సైడ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని అన్నారు. ఈ ప్రాంతంలో నివసించే ప్రజలకు మంచినీటి సమస్య లేకుండా ఈ రోజు పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని తెలిపారు. గతంలో స్వర్గీయ దేవినేని నెహ్రూ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి జరిగిందని తరువాత టీడీపీ ప్రభుత్వం లో పూర్తిగా నిర్లక్ష్యనికి గురై మరలా వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అని అవినాష్ అన్నారు.మున్సిపల్ ఎన్నికల తరువాత కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా కృషి చేస్తున్నారు అని అభినందించారు.కొండప్రాంత అభివృద్ధి కి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తూ సహకరిస్తున్న మున్సిపల్ సిబ్బందికి, సంబంధిత అధికారులకు అవినాష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ వైస్సార్సీపీ నాయకులు డేవిడ్ రాజు, చందా కిరణ్, బాబ్జి, రవిప్రకాష్,పెడబాబు, సుమన్, మొయిన్, సురేష్, జోజి తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *