రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
మధ్య తరగతి ఆదాయ వర్గ ల వారి కోసం గుర్తించిన లే అవుట్లని పరిశీలించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీదర్ పేర్కొన్నారు. రాజానగరం మండలం వెలుగుబంద, కానవరం గ్రామాలలోని లే అవుట్ (ఎంఐజీ) భూములను బుధవారం జాయింట్ కలెక్టర్ పరిశీలన చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, మధ్య తరగతి ఆదాయ వర్గాలు కోసం సేకరిస్తున్న స్థలాలు అందుబాటు ధరల్లో ఉండేలాగా సేకరణ చేపట్టాలన్నారు. ఆయా లే అవుట్ లు రాష్ట్ర, జాతీయ రహదారికి అనుసంధానంచేసే విషయంపై, ప్రత్యాన్మయ రహదారుల విషయంపై జేసీ ఆరా తీసి వివరాలని అడిగారు. ఒక ప్రక్క పేదలందరికీ ఇళ్ల స్థలాల ను ఉచితంగా పంపిణీ చేసి, ఆర్థిక చేయూతను ఇవ్వడం జరుగుతోందన్నారు. మధ్య తరగతి ఆదాయ వర్గాల కోసం ప్రభుత్వ ధరకే స్థలాలు అందించడానికి ఉద్దేశించి నందున అందుకు అనుగుణంగా స్థల సేకరణ చేపట్టడం జరుగుతోందని పేర్కొన్నారు. అనంతరం లే అవుట్ కు సంబంధించిన మ్యాప్ ను పరిశీలించి తగిన సూచనలు చేశారు. జేసీ రెవెన్యూ, హౌసింగ్, సర్వే అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News