విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న సంపూర్ణ గృహా హక్కు పథకంలో ఒన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఒటిఎస్) డిజిటల్ సిగ్నేచర్ జాప్యాన్ని నివారించి త్వరితగతిన ప్రక్రియను పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుండి జగనన్న సంపూర్ణ గృహా హక్కు పథకంలో ఒన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఒటిఎస్) జగనన్న గృహానిర్మాణాల ప్రగతి, పెన్షన్‌ల పంపిణీ తదితర అంశాలపై ఆర్‌డివోలు, యంపిడివోలు, తహాశీల్థార్లు ,మున్సిపల్ కమీషనర్లతో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా లబ్దిదారులకు గృహా హక్కును కల్పించడంలో ముఖ్యమైన డిజిటల్ సిగ్నేచర్ జాప్యాన్ని త్వరితగతిన పరిష్కరించి వేగవంతం చేయాలన్నారు. ఎంపిడివోలు డిజిటల్ సిగ్నేచర్ విషయములో అలసత్వం కూడదన్నారు. పెండిరగ్ ఎక్కువగా ఉన్న గ్రామల వారి సమీక్షించారు. పెండిరగ్‌కు తగిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. అప్రూవల్ అయిన డేటా పూర్తి స్థాయిలో డిజిటల్ సిగ్నేచర్‌పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తహాశీల్థార్ స్థాయిలో ఓటియెస్ పెండిరగ్ ఉండరాదన్నారు. అప్రూవల్ అయినవి ఏస్థాయిలోను పెండిరగ్ ఉండరాదన్నారు. డాక్యుమెంట్స్ అప్‌లోడ్ పూర్తి చేయాలని కోరారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పించన్ అందాలని, అనర్హులకు పించన్లు అందుతున్నాయని పిర్యాదులు రానియరాదన్నారు. పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక జరగాలన్నారు. సాంకేతికంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవటం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో వెనుకబడి ఉన్న వివిధ మండలాల యంపిడివోలు తహాశీల్థార్లను కలెక్టర్ వివరణ కోరారు. డిజిటల్ సిగ్నేచర్ పెండిరగ్ ఉండడానికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ కోరారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్ డిఆర్‌వో కె.మోహన్‌కుమార్,జడ్పి సిఇవో సూర్యప్రకాష్ ఉన్నారు.
Tags vijayawada
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …