డిజిటల్‌ సిగ్నేచర్‌ విషయములో అలసత్వం కూడదు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న సంపూర్ణ గృహా హక్కు పథకంలో ఒన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఒటిఎస్‌) డిజిటల్‌ సిగ్నేచర్‌ జాప్యాన్ని నివారించి త్వరితగతిన ప్రక్రియను పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుండి జగనన్న సంపూర్ణ గృహా హక్కు పథకంలో ఒన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఒటిఎస్‌) జగనన్న గృహానిర్మాణాల ప్రగతి, పెన్షన్‌ల పంపిణీ తదితర అంశాలపై ఆర్‌డివోలు, యంపిడివోలు, తహాశీల్థార్లు ,మున్సిపల్‌ కమీషనర్లతో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా లబ్దిదారులకు గృహా హక్కును కల్పించడంలో ముఖ్యమైన డిజిటల్‌ సిగ్నేచర్‌ జాప్యాన్ని త్వరితగతిన పరిష్కరించి వేగవంతం చేయాలన్నారు. ఎంపిడివోలు డిజిటల్‌ సిగ్నేచర్‌ విషయములో అలసత్వం కూడదన్నారు. పెండిరగ్‌ ఎక్కువగా ఉన్న గ్రామల వారి సమీక్షించారు. పెండిరగ్‌కు తగిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. అప్రూవల్‌ అయిన డేటా పూర్తి స్థాయిలో డిజిటల్‌ సిగ్నేచర్‌పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. తహాశీల్థార్‌ స్థాయిలో ఓటియెస్‌ పెండిరగ్‌ ఉండరాదన్నారు. అప్రూవల్‌ అయినవి ఏస్థాయిలోను పెండిరగ్‌ ఉండరాదన్నారు. డాక్యుమెంట్స్‌ అప్‌లోడ్‌ పూర్తి చేయాలని కోరారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పించన్‌ అందాలని, అనర్హులకు పించన్లు అందుతున్నాయని పిర్యాదులు రానియరాదన్నారు. పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక జరగాలన్నారు. సాంకేతికంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవటం జరుగుతుందని కలెక్టర్‌ అన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో వెనుకబడి ఉన్న వివిధ మండలాల యంపిడివోలు తహాశీల్థార్లను కలెక్టర్‌ వివరణ కోరారు. డిజిటల్‌ సిగ్నేచర్‌ పెండిరగ్‌ ఉండడానికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ కోరారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపూర్‌ అజయ్‌ డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌,జడ్పి సిఇవో సూర్యప్రకాష్‌ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *