Breaking News

సినిమా టిక్కెట్ల ఆన్‌లైన్‌ వెబ్‌ పోర్టల్‌పై థియేటర్ల యాజమాన్యం అవగాహన కలిగి వుండాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సినిమా టిక్కెట్ల ఆన్‌లైన్‌ వెబ్‌ పోర్టల్‌పై థియేటర్ల యాజమాన్యం అవగాహన కలిగి వుండాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపూర్‌ అజయ్‌ అన్నారు.
నగరంలోని కలెక్టరేట్‌ స్పందన సమావేశ మందిరంలో బుధవారం జిల్లాలోని థియేటర్ల యాజమాన్యంతో అన్‌లైన్‌ టిక్కెట్‌ బుకింగ్‌ విధానంపై జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపూర్‌ అజయ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో సినిమా థియేటర్ల కోసం అన్‌లైన్‌ టిక్కెట్‌ బుకింగ్‌ సిస్టమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. దీనిలో భాగంగా సినిమా టిక్కెట్లను అన్‌లైన్‌లో విక్రయించడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫిల్మ్‌ టెలివిజన్‌అండ్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎపిఎస్‌ఎఫ్‌టివిటిడిసి)కు అన్ని థియేటర్ల యజమానులతో అవగాహన ఒప్పందాన్ని కుదురించుకోవడానికి ప్రభుత్వం అధికారం ఇవ్వడం జరిగిందన్నారు. థియేటర్‌ యాజమానులు రూ.100 నాన్‌ జ్యూడిషియల్‌ స్టాంప్‌ పేపర్‌పై థియేటర్లకు సంబంధించిన పూర్తి సమాచారంతో ప్రోఫార్మాతో పాటు ఇండిప్లికేట్‌ చేయాలన్నారు. అన్‌లైన్‌ టిక్కెట్లకు సంబంధించి యజమానులు ఎపిఎస్‌ఎఫ్‌టివిటిడిసి తో తప్పనిసరిగా అవగాహన ఒప్పందాన్ని కలిగి కేవలం అన్‌లైన్‌ ద్వారా మాత్రమే టిక్కెట్లను విక్రయించాలని జాయింట్‌ కలెక్టర్‌ తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌ థియేటర్ల యాజమానులు ఉన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *