Breaking News

సమగ్ర న్యాయం కోసం గాంధీ దీక్షతో గాంధీ యాత్ర…


-మత్తు పదార్థాల వల్ల విద్యార్థులు, యువత నాశనం అయిపోతున్నారు
-బతికినా, చచ్చినా దేశం కోసమే

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“మంచి ఓటు మనం వేద్దాం అది మంచి వ్యక్తికే వేద్దాం”, “బ్రతికితే దేశం కోసం….చస్తే దేశం కోసం” అని గాంధీ దీక్షాపరులు గాంధీ నాగరాజన్ అన్నారు. గాంధీ నాగరాజన్ 52వ పుట్టిన రోజు సందర్భంగా శనివారం ఊర్మిళ నగరంలో, బాపతి భారతి ఆధ్వర్యంలో గాంధీ యుగంలో పోరాడిన స్త్రీల గురించి విద్యార్థులకు పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ స్త్రీ రక్షణ లేని స్వాతంత్రం, స్వాతంత్రం కానేకాదని, స్త్రీ రక్షణే స్వాతంత్ర లక్ష్యమన్నారు. స్త్రీ అన్ని రంగాలలో 67% ఎదిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యము వస్తుందని తెలిపారు. పేద, ధనిక భేదం లేకుండా సమగ్రమైన చట్టం కావాలన్నారు. ఈ దేశంలో అతి తక్కువ మంది ధనవంతులు అవుతున్నారని, అతి ఎక్కువ మంది బానిస బతుకులు బతుకుతున్నారని, బానిసలకు విముక్తి ఓటే ఆయుధమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు వాళ్ల పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని, ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేసుకోవాలని అప్పుడే సమానత్వం అలవడుతుందని చెప్పారు. మన పరిపాలన విధానం అహింసా పరిపాలన మార్గంలో నడవాలని, అలాగే హిందూ, ముస్లింల సమైక్యతపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కళాశాల, పాఠశాల విద్యార్థులు, యువత, ఎక్కువగా మత్తు పదార్థాల వినియోగం వల్ల జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వెంటనే మత్తుపదార్థాలను పూర్తిగా రద్దు చేసి మత్తుపదార్థాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ తమ సమస్యలు నెరవేరేవరకు ఒక రోజు నిరాహార దీక్ష కానీ,రిలే నిరాహార దీక్ష కానీ, నిరాహార దీక్ష కానీ చేపడతానని ప్రభుత్వాలు నడుచుకునే విధానం బట్టి తన పోరాట విధానం ఉంటుందని తెలిపారు. “బ్రతికితే దేశం కోసం, చస్తే దేశం కోసం” అనే నినాదంతో గాంధీ దీక్ష ను 253 రోజులుగా కొనసాగిస్తున్నానని, ఇదే తన గాంధీ యాత్ర అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మహిళ అధ్యక్షురాలు ఆర్. ఎన్. శివరంజని, ట్రస్ట్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి

-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *