విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రి దుర్గ గుడి పరిసర ప్రాంతాలలో కోట్పా యాక్ట్‌ను అమలు చేసి సిగరెట్ ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగ నిషేదిత ప్రాంతంగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు. ఇంద్రకీలాద్రి మరియు పరిసరాల ప్రాంతాలలో కోట్పాయాక్ట్ అమలు చేసి తిరుమల కొండపై అమలు చేస్తున్న విధంగా ధూమపానం ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగ నిషేదిత ప్రాంతంగా ప్రకటించేందుకు తీసుకోవలసిన చర్యలపై శనివారం జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు ఆలయ కార్యనిర్వహణాధికారి, వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్, దుర్గగుడి సెక్యూరిటీ అధికారులతో గూగుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోట్పా యాక్ట్‌లోని సెక్షన్‌లను అనుసరించి బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం, పొగాకు ఉత్పత్తులను వినియోగించడం వాటిపై ప్రచారం నిర్వహించడం నేరం అని అన్నారు. విద్యాసంస్థల ఉన్న వంద చదరపు గజాల దూరంలో పొగాకు ఉత్పత్తుల అమ్మకాల నిషేదం ఉన్నట్లు తెలిపారు. రాష్టంలోనే అతిపెద్ద దేవాలయంలో రెండవ దేవాలయంగా గుర్తింపు పొంది అతి ప్రవితమైన ఇంద్రకీలాద్రి దుర్గగుడి పరిసరాలను పొగాకు ధూమపాన రహిత ప్రాంతంగా ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. భక్తుల మనోభవాలను పరిగణలోనికి తీసుకుని దుర్గ గుడి పరిసర ప్రాంతాల ప్రవితతను కాపాడదాంమన్నారు. తిరుమల కొండపైన అమలు చేస్తున్న విధంగా దుర్గ గుడి కొండ పరిసర ప్రాంతాలలో కూడా ఈనెల 25వ తేదీ నుండి కోట్పా యాక్ట్ అమలు చేసేలా విధి విదానాలను రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. కోట్పాచట్టంపై భక్తులకు అవగాహన కలిగేలా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని, భక్తులు అమ్మవారిని దర్శించుకునే ప్రధాన మార్గాలైన ఘాట్ రోడ్ మహామండపం, లిఫ్ట్ కనకదుర్గ నగర్ మెట్లదారి వద్ద పొగాకు ఉత్పత్తులు వినియోగించ కుండా చర్యలు తీసుకోవాలని కొండపైకి వచ్చే భక్తులను తనీఖీ చేసి సిగరెట్లు, పాన్‌పరాగ్, గుట్కా, ఖైనీ, వంటి పొగాకు ఉత్పత్తులు కొండపైకి అనుమతించకుండా సెక్యూరిటీ సిబ్బందికి చట్టం పై అవగాహన కల్పించాలని కలెక్టర్ డిల్లీరావు ఆదేశించారు. త్వరలో దేవస్థానం పోలీస్, సెక్యూరిటీ, ఉద్యోగులు, వ్యాపారస్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కోట్పా చట్టంపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. గూగుల్ కాన్ఫరెన్స్‌లో దుర్గ గుడి ఆలయ ఇవో డి భ్రమరాంబ, డియంహెచ్‌వో యం సుహసిని, అడిషనల్ డియంహెచ్‌వో ఉషా, ఎసిపి బి.సత్యానందం, ఆయల సెక్యూరిటీ అధికారి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News