-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఈ వేస్ట్) పై ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుని పర్యవరణాని పరిరక్షించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల వలన కలిగే అనర్థాలను ప్రజలకు వివరించడం వాటిని సేకరణ నిర్వహణకు చేపడుతున్న చర్యలపై శనివారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు అధికారులతో గూగుల్ కాన్ఫరెన్స ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్ట్రానిక్ వ్యర్థాల వలన పర్యావరణ కాలుష్యమవుతుందని రాబోయే తరానికి ఇది మరింత జటిలం కానున్నదన్నారు. ఎక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని కలెక్షన్ల సెంటర్లకు తరలించేలా ప్రణాళికను రూపొందించాలన్నారు. ఎక్ట్రానిక్ వ్యర్థాలపై ప్రజలకు అవగాహన కలిగేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. సేకరించిన ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ప్రైవేటు సంస్థలు ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నాయో పరిశీలించాలన్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఎక్కువగా వస్తున్న ప్రాంతాలలో ప్రత్యేక కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసేలా చర్యలు త్ణీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కలెక్షన్ సెంటర్లను తొలిదశలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించడంలో ప్రైవేట్ సంస్థల ప్రాసెసింగ్ విధానాన్ని పరిశీలించి ప్రభుత్వపరంగా ఏర్పాటుకు విధి విధానాలను పరిశీలించాలన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు విక్రయించే దుకాణదారులు పాడైన వాటిని తిరిగి తీసుకుని కొత్తవి విక్రయించేలా గత కాన్ఫరెన్స్‌లో తీసుకొన్న నిర్ణయాన్ని నేటి వరకు ఎందుకు అమలు చేయలేదని కలెక్టర్ ప్రశ్నించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణపై కాన్ఫరెన్స్ నిర్వహించి తీసుకుంటున్న చర్యలను సమీక్షించడం జరుగుతుందని కలెక్టర్ డిల్లీరావు అన్నారు. గూగుల్ కాన్ఫరెన్స్‌లో మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పునకర్, ఏపిపిసిబిఇ ఇఇ టి. ప్రసాద్‌రావు, డిఐఎస్‌సి జనరల్ మేనేజర్ బి. శ్రీనివాస్‌రావు, ఏపిఐఐసి జోనల్ మేనేజర్ డి.శ్రీనివాస్, డిపివో చంద్రశేఖర్, గుడ్లవలేర్లు ఇంజనీరింగ్ కళాశాల ప్రోఫెసర్ డా. కామరాజు, కెఎల్ యూనివర్సిటి హెచ్‌వోడి డా. యం రాఘవరావు, విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాప్రోఫెసర్ డా. యం.వి రామకృష్ణ, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కె. విద్యాధరరావు, ఎఫ్‌ట్రానిక్స్ యండి. దాసరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.