Breaking News

ప్రజలకు చేసే సేవలలో లోపాలు చేసిన అధికారులకు జిల్లా వినియోగదారుల కమిషన్ 10 వేల రూపాయలు పరిహారం…

-జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు డి. కోదండ రామ మూర్తి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వివరాలలోకి వెళితే గోపాలపురం మండలం రాజంపాలెం కు చెందిన కండవల్లి సోమేశ్వరరావు 2015వ సంవత్సరంలో రాజంపాలెం మెయిన్ రోడ్డు- దొండపూడి గ్రామాలలో గల తన ఇంటికి మంచినీటి పైపు కనెక్షన్ కోసం దొండపూడి గ్రామ పంచాయతీకి రూ. 2 వేలు చెల్లించారు. పైపులైన్, తదితర ఖర్చుల నిమిత్తం మరో పది వేల రూపాయలు చెల్లించగా పంచాయతీ అధికారులు కండవల్లి సోమేశ్వరరావు పైపు కనెక్షన్ అందించారు. 2015-16 సంవత్సరానికి సంబంధించి వాటర్ టాక్స్ కూడా చెల్లించారు.

దొండపూడి గ్రామ సర్పంచ్ వ్యక్తిగత కక్ష కారణంగా ఎటువంటి నోటీసు జారీ చేయకుండా సదరు కండవల్లి సోమేశ్వరరావు మంచినీటి పైపు కనెక్షన్ ను తొలగించారు. దీని కారణంగా కండవల్లి సోమేశ్వరరావు తో పాటు ఆ ఇంట్లో ఉంటున్న 3 కుటుంబాలు కూడా త్రాగునీరు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ విషయంపై దొండపూడి గ్రామ పంచాయతీ అధికారులను, గోపాలపురం ఎంపిడిఓ ను పలుమార్లు విజ్ఞప్తి చేసుకున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వ సిబ్బంది సేవా లోపం, అందుకు తమ ఇంట్లో ఉంటున్న కుటుంబాలు తాగునీరు లేక పడిన ఇబ్బందులను తెలియజేస్తూ తనకు న్యాయం చేయాలనీ వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు. కేసుకు సంబంధించి జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్తులు డి. కోదండ రామ మూర్తి, కమిషన్ సభ్యులు ఎస్. సురేష్ కుమార్, శ్రీమతి కె.ఎస్.ఎన్ . లక్ష్మి కేసు పూర్వాపరాలను విచారించి ఫిర్యాదుదారునితో ఏకీభవించారు.

దొండపూడి గ్రామ పంచాయతీ ఫిర్యాదుదారునికి పదివేల రూపాయలు పరిహారం చెల్లించాలని, సదరు ఫిర్యాదుదారుడికి మంచినీటి పైపు కనెక్షన్ ను ఎటువంటి చార్జీలు వసూలు చేయకుండా తిరిగి పునరుద్దరించాలని ఆదేశాలు జారీ చేసారు.

Check Also

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి

-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *