వై ఎస్ ఆర్ సంచార పశు వైద్య సేవా పథకం ప్రారంభం…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అనారోగ్యంకు గురైన మారుమూల ఉన్న పశువులు కూడా ఇంటి వద్ద వైద్యసేవలు అందించే లక్ష్యంతోడా వై ఎస్ ఆర్ సంచార పశు వైద్య సేవా పథకం ప్రారంభించడం జరిగింది అని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. శనివారం కొవ్వూరు లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సంచార పశు వైద్య వాహనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, రాష్ట్రంలో 175 శాసన సభ నియోజకవర్గాల్లో రూ.142.90 కోట్లతో తొలి విడత లో సంచార పశు వైద్య సేవా వాహనాలను పంపిణీ చేశామన్నారు. కొవ్వూరు నియోజక వర్గం పరిధిలో ఈ వాహనం ఈరోజు నుంచి అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. రూ.32 లక్షలు ఖరీదు చేసే ఈ వాహనం కోసం కేంద్రం , రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అందుబాటులోకి తీసుకుని వస్తున్నట్లు ఆమె తెలిపారు. రెండో దశలో మరో 165 వాహనాల ను సమకూర్చడం ద్వారా రాష్ట్రం పశువులకు ఆరోగ్య భరోసాను కల్పించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. అనారోగ్యానికి గురి అయిన పశువులకు తక్షణ వైద్య సహాయం అందించడం వలన అకాల పశువుల మరణాలను నివారించడం ద్వారా రాష్ట్రంలో పశువుల ఉత్పాదక శక్తి పెంచడం సాధ్యం అవుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో వైద్య సేవలు అందించాల్సిన వస్తే 1962 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సేవలు పొందా లన్నారు. నకలీ ఫోన్ కాల్ చేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. హైడ్రాలిక్ లిఫ్టింగ్ మెకానిజం తో పాటు పశువైద్యులు, సహాయకులు, డ్రైవర్ అందుబాటులో ఉంటారని, ప్రతినెలా రూ. ఒక లక్షా 68 వేలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి తో పాటు ఎంపిపి కాకర్ల నారాయుడు, జిల్లా పశు వైద్య అధికారి డా. ఎస్టిజీ.సంత్యా గోవింద్, పలువురు ప్రజా ప్రతినిధులు కె. భాస్కర్ రావు తదితరులు పాల్గోన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *