-సోమవారం ఉదయం ప్రారంభమైన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్
-32 వ వార్డులో కాలువలో షిల్ట్ తీసిన ఎంపి
-రాజమహేంద్రవరం అర్బన్ రూరల్ పనిచేయనున్న 1500 మంది శానిటేషన్ సిబ్బంది
-ముఖ్యంగా ప్రజల్ని భాగస్వామ్యం చేస్తున్నాం
-స్పెషల్ డ్రైవ్ అనంతరం హరిత యువత కార్యక్రమం –
-ఎంపీ మార్గాని భరత్, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, రూడా చైర్ పర్సన్ ఎం.షర్మిలా రెడ్డి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని 50 డివిజన్ ల పరిధిలో శానిటేషన్ కార్యక్రమం లో భాగంగా కాలవల్లోని షిల్ట్ ను తీసివేసేందుకు ప్రత్యేక డ్రైవ్ కు శ్రీకారం చుట్టడం జరిగిందని పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ లు పేర్కొన్నారు.
సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ” స్వచ్ఛ రాజమహేంద్రవరం – స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ” లో భాగంగా దేవిచౌక్ వద్ద స్పెషల్ డ్రైవ్ ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ, రాజమహేంద్రవరం పట్టణ, గ్రామీణ ప్రాంతంలో పారిశుధ్యం పై ప్రత్యేకదృష్టి సారించడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా వారం రోజులుపాటు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం 1500 మంది శానిటేషన్ సిబ్బందితో డ్రెయిన్లు లోని షిల్ట్ (కాలువల్లో మురుగు) తొలగించడం జరుగుతుందన్నారు. వారితో పాటు గా ముఖ్యంగా ప్రజలను కూడా భాగస్వామ్యం చెయ్యడం జరుగుతుందని ఎంపి పేర్కొన్నారు. వర్ష కాలం వలన లోతట్టు ప్రాంతాలలో ముంపు సమస్య ఎదుర్కోవలసి వస్తుందన్న నేపథ్యంలో కాలువల్లో మురుగు తీసివేయ్యాడానికి చర్యలలో భాగంగా ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ డ్రైవ్ అనంతరం యువత- హరిత కార్యక్రమం ద్వారా నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపడతున్నట్లు ఎంపి ప్రకటించారు. గతంలో కూడా యువత హరిత కార్యక్రమాన్ని చేపట్టి మొక్కలు నాటడం జరిగిందన్నారు. ప్రజలు కూడా వారి ఇంటి ముందు ఉన్న కాలువల్లో షిల్ట్ తొలగించే పనులను పరిశీలించి సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. మనది అనే భావన ప్రతి ఒక్క నగర పౌరుల్లో కల్పించడం కోసం అవగాహన ర్యాలీ నిర్వహించామన్నారు.
నగరపాలక సంస్థ కమిషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, క్లీన్ అప్ సిటీగా మన నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రజలు భాగస్వామ్యం కావలసి ఉందన్నారు. కాలవల్లో చెత్త వెయ్యకూడదు, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలనే భావన ప్రతి ఒక్కరిలో కలగాల్సి ఉందన్నారు. ప్రజల ద్వారా పలు ఫిర్యాదులు అందాయని, అందులో భాగంగా మురుగు ఎక్కువగా చేరిన 750 ప్రాంతాలను గుర్తించడం జరిగిందన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రచార విధానంలో పరిశుభ్రం చేస్తామన్నారు. ఇందు కోసం అదనపు శానిటేషన్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్పొరేషన్ ద్వారా సుమారు 1050 మంది ప్రతిరోజూ ఇంటింటి నుంచి చెత్త సేకరణ చేస్తున్నా రాన్నరు. శానిటేషన్ సిబ్బంది, అదనపు సిబ్బంది తో ప్రతి రోజు 4/5 వార్డుల్లో స్పెషల్ డ్రైవ్ ద్వారా నగరంలో ప్రతి నిత్యం శానిటేషన్ చెయ్యడం జరుగుతుందన్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఇది సాధ్యం కాదన్నారు. ప్రతి ఒక్కరిలో అవగాహన అవసరం.. ఇందుకోసం ఆర్ ఎం సి , మెప్మా సిబ్బంది, వార్డ్ స్థాయి కార్యదర్శులు, వాలంటీర్లు క్షేత్ర స్థాయిలో వారి సేవలతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకుని రావడం జరుగుతుందన్నారు.
తొలుత దేవిచౌక్ కు చేరుకున్న ఎంపి, మునిసిపల్ కమిషనర్ , రూడా ఛైర్ పర్సన్ తో కలిసి ర్యాలీగా బయలుదేరి కంబాల చెరువు మీదుగా 32, 33 వార్డుల్లో అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కాలువల్లో పేరుకు పోయిన మురుగును తొలగించి ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చారు.
ఈ కార్యక్రమంలో రూడా చైర్ పర్సన్ ఏం. షర్మిలా రెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఏం. వేంకటేశ్వర రావు, అదనపు మునిసిపల్ కమీషనర్ పి. వి. సత్యవేణి, ఇంజనీరింగ్ ఇతర అధికారులు ఎస్ ఈ జి.పాండురంగారావు, జే.సూరజ్ కుమార్, డా.వినూత్న, ఎన్జీఓ టికే విశ్వేశ్వరరెడ్డి, శానిటేషన్ సూపర్ వైజర్ శ్రీనివాసరావు, శానిటేషన్ సిబ్బంది, పలువురుప్రజాప్రతినిధులు , వార్డు , సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.