భట్రాజు కులస్తులకే ధ్రువపత్రాలు ఇవ్వాలి…

-భట్రాజు కులస్తుల డిమాండ్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భట్రాజు కులానికి చెందిన వారికి మాత్రమే అధికారులు కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని, డబ్బుల కోసం కొంతమంది నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి భట్రాజు కులానికి ఉన్న రిజర్వేషన్ ను హరి ఇస్తున్నారని రాష్ట్ర భట్రాజు సంఘం ఉమెన్ ప్రెసిడెంట్ పి.చంద్రకళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కొందరు తమ కులానికి చెందిన సిఫార్సు లేఖలు నెంబర్లు మార్చి, కాలం చెల్లిన నెంబర్లను వేసి ఆయా మండల తాహశీల్దార్ లకు ఇచ్చి కుల ధ్రువీకరణ పత్రాలు పొందేలా చేస్తున్నారన్నారు. దీనివల్ల బిసి-డి,4లో ఉన్న భట్రాజు కులస్తులు రాజ్యాంగం ద్వారా పొందుతున్న రిజర్వేషన్ హక్కులను కోల్పోతున్నారన్నారు. అక్రమంగా తమ కులం సర్టిఫికెట్లు పొంది నకిలీలు అనుభవిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది లక్షల మంది ఉన్న భట్రాజు కులస్తుల సమస్యలపై త్వరలో మంత్రులు, ఎమ్మల్యేలను కలిసి ఇ సమస్యను వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ భట్రాజు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల లేపాక్షిఈశ్వరరాజు, మధుసూదన్ రాజు, గోపీనాథ్ రాజు, నరేందర్ రాజు, ప్రకాష్ రాజు, రామరాజు, ఎస్ఎస్ రాజు, ఏవి రాజు, హరిత పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *