-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జరుగుతున్న జగనన్న సంపూర్ణ గృహా హక్కు పథకానికి సంబంధించిన పనులను, పేదల కోసం ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకంలో పురోగతిపై జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి బుధవారం ఆర్‌డివోలు, యంపిడివోలు, తహాశీల్థార్లు, గృహా నిర్మాణా శాఖలకు చెందిన అధికారులతో జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో పేదల కోసం ప్రభుత్వం మంజూరు చేసి రిజిస్టర్ కాబడి వివిధ స్థాయిలో పనులు జరుగుతున్న 75,949 గృహాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇంకనూ ప్రారంభం కాని వాటిని లబ్దిదారులతో త్వరితగతిన ప్రారంభింప చేయాలన్నారు. బిలో బేస్‌మెంట్ స్థాయిలో ఉన్న 43,797 గృహాలను బేెస్‌మెంట్ స్థాయికి, బేస్‌మంట్ స్థాయిలో ఉన్న 8,636 గృహాలను రూప్‌లెవల్ స్థాయికి, రూప్‌లెవల్ స్థాయిలో ఉన్న 1,620 గృహాలను రూప్‌కాస్టింగ్ స్థాయికి, రూప్ కాస్టింగ్ స్థాయిలో ఉన్న 4,430 గృహాలను పూర్తి నిర్మాణ స్థాయికి తీసుకురావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులలో సాంకేతిక పరమైన మెటిరియల్ సరఫరా వంటి సమస్యలను పరిష్కరించుకుని గడువులోగా పూర్తి చేయాలన్నారు.
జగనన్న సంపూర్ణ గృహా హక్కు పథకంలో లబ్దిదారుల డిజిటల్ సిగ్నేచర్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో తహాశీల్థార్లు అమోదించిన 31,856 మంది లబ్దిదారులలో 24,199 అన్‌లైన్ రిజిస్టర్ కాబడ్డాయని మిగిలిన వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఒటిఎస్ ప్రక్రియలో గ్రామ సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు కూడా భాగస్వామ్యులను చేసి గృహా నిర్మాణ, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఒటిఎస్‌లో రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కుటుంబ పరిస్థితులు, అభ్యంతరాలు, డాక్యుమెంట్ సరిచేయుట, మరణించడం, సాంకేతిక సమస్యలు, ప్రింటింగ్ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహా హక్కు పథకం వలన కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించి అర్హులైన ప్రతీ లబ్దిదారునికి ఒటిఎస్ లబ్ది చేకూర్చాలని కలెక్టర్ అన్నారు. స్వయం సహాయక సంఘాలలో సభ్యులైన వారికి అర్హత మేరకు బ్యాంకుల ద్వారా రుణాలు, క్యాష్, క్రెడిట్ లోన్ మంజూరుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో డిఆర్‌వో కె. మోహన్‌కుమార్ జడ్పిసిఇవో సూర్యప్రకాశరావు, హౌసింగ్ పిడి శ్రీదేవి తదితరులు ఉన్నారు.