విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిషేధిత భూముల జాబితా సెక్షన్ 22(ఏ) లో ఉన్న భూముల తొలగింపు మేళా ద్వారా ప్రజలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న భూసమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నార్త్ తహసీల్దార్ కార్యాలయంలో శనివారం జరిగిన నిషేధిత భూముల జాబితా నుండి తొలగింపు మేళాలో ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఈ నెల 25 మరియు 27 నుండి 30 వ తేదీల వరకు నిషేదిత భూముల జాబితా [22(A)] నుండి తొలగింపు మేళాను నిర్వహిస్తున్నట్లు వివరించారు. సెక్షన్ 22(ఏ) గుదిబండగా మారిన ప్రస్తుత తరుణంలో.. ప్రజలకు ఈ మేళా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గుణదల, గాంధీ నగర్, నున్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల పరిధిలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న దాదాపు 7 వేల అర్జీలకు మేళా ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రధానంగా రాధానగర్, శాంతినగర్, పాయకాపురం, ప్రకాష్ నగర్, సుందరయ్యనగర్ పరిధిలో నిషేధిత భూముల జాబితా నుండి తక్షణమే తొలగించాలని అధికారులకు సూచించారు. కనుక అర్జీదారులు రికార్డు పూర్వక ఆధారాలతో వారి వారి రెవిన్యూ / సచివాలయ కార్యాలయాలలో అర్జీలను దాఖలు చేసుకోవాలని తెలిపారు. సదరు దరఖాస్తులను పరిశీలించిన తర్వాత పొరపాటుగా నమోదైన అసైన్డ్ భూములను జాబితా నుండి తొలగించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ చంద్రమౌళి, నాయకులు ఎండి హఫీజుల్లా, దేవిరెడ్డి రమేష్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …