విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సుప్రీం కోర్టు విశ్రాంత జస్టిస్ మరియు మిజోరాం గవర్నర్ ముఖ్య అతిధులుగా అనంతపురం జిల్లాలో జూలై నెలలో ఏంతో ప్రతిష్టాత్మకంగా జరపబొయే జాతీయ సమైక్య సమావేశం మరియు అవార్డు ఫంక్షన్ కోసం జాతీయ ఛైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు వి వి రామకృష్ణా రెడ్డి సూచనలు పాటిస్తూ నేషనల్ అడిషనల్ సెక్రటరీ డాక్టర్ కందుల చందు అధ్యక్షతన ఆయన కార్యాలయంలో సోమవారం కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ప.గో.జిల్లా & తూ.గో జిల్లాలకు చెందిన ఎన్ హెచ్ ఆర్ సి సభ్యులు అందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లాలో జరిగే కార్యక్రమం దిగ్విజయముగా నిర్వహించాలని అందరు తీర్మానం చేశారు. ఈ కార్యక్రమానికి విరాళంగా స్టేట్ జాయింట్ సెక్రటరీ అమీన్ భాయ్ 5 వేలు రూపాయలు చెక్కు ద్వారా అందించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు నందం నరసింహ రావు, వేంకటేశ్వర రావు, రాష్ట్ర ఉపాధ్యక్షు రాలు సంధ్య, కాసిబోట్ల విజయలక్ష్మి, రాష్ట్ర మహిళా వెల్ఫేర్ సెక్రటరీ కొండా జయలక్ష్మి, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ అశోషియేట్ ఇంచార్జి మరియు స్టేట్ వెల్ఫేర్ సెక్రటరీ రూప్ నాధ్, స్టేట్ కో- ఆర్డినెటర్ విజయ్ శేఖర్, డివిజనల్ ఉపాధ్యక్షులు జగన్ మోహన్ మరియు లీగల్ డిపార్ట్మెంట్ వారు, అన్ని జిల్లాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …