Breaking News

నగరంలో ఏపీ కాపు అడ్వకేట్స్‌ ఆత్మీయ సమావేశం…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌ కాపు అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఆత్మీయ సమావేశం పాతబస్తీలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాలులో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి అన్ని జిల్లాల నుంచి కాపు న్యాయవాదులు, ప్రముఖ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాపు సమాఖ్య జాతీయ అధ్యక్షుడు నరహరశెట్టి శ్రీహరి మాట్లాడుతూ కాపులు అన్ని రంగాల్లోనూ రాణించాలని అప్పుడే సాధికారత దిశగా అడుగులు పడతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాపు సామాజిక వర్గంలో అధిక సంఖ్యలో న్యాయవాదులు న్యాయవాద వృత్తిని కొనసాగిస్తున్నారన్నారు. వారంతా ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరముందన్నారు. దానికి సంబంధించి ఎపీ కాపు అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ను స్థాపించటం, సమావేశాన్ని నిర్వహించటం ఆనందంగా వుందన్నారు. ప్రధానంగా కాపు యువ న్యాయవాదులు మరింత రాణించటానికి సంఘం అండగా వుండాలన్నారు. ప్రధానంగా కాపు యువ న్యాయవాదులు మరింత రాణించటానికి సంఘం అండగా వుండాలన్నారు. అలాగే కాపులు ఏ రంగంలో వున్నా వారి సంక్షేమానికి అవసరమైన న్యాయపరమైన సేవలను సంఘం అందించాలని సూచించారు. సంఘం పాలకవర్గంలో అన్ని ప్రాంతాలు భాగస్వాములను చేసి సేవలను విస్తృతంగా చేయాలని సూచించారు. సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌వీ సత్యనారాయణ, పాపాన సుబ్బారావులు మాట్లాడుతూ కాపు న్యాయవాదుల సంక్షేమం, వృత్తి నైపుణ్యాలను పెంపు తదితర లక్ష్యాలతో సంఘాన్ని స్థాపించామన్నారు. సంఘ లోగోను ఇటీవలే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించామన్నారు. రానున్న కాపుల అభ్యన్నతికి రాబోయే రోజుల్లో విస్తృతంగా కార్యక్రమాలను నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నామన్నారు. రాష్ట్రంలో కాపుల సంక్షేమానికి విశేషమైన సేవలందించిన కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు పీవీ నారాయణస్వామి, వివిధ సంఘాలు, సంస్థలకు చెందిన నరహరశెట్టి రామచంద్రరావు, పేటేటి పుల్లయ్య, ఆకుల శ్రీనివాస్‌, అక్కల గాంధీలను సమావేశంలో ఘనంగా సత్కరించారు. వివిధ బార్‌ అసోసియేషన్స్‌ అధ్యక్షులు ఎం.ఆదినారాయణరావు (అమలాపురం), పి.వెంకటేశ్వర్లు (గుంటూరు), కె.శివరామకృష్ణప్రసాద్‌ (మచిలీపట్నం) బెజవాడ బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి గంధం శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవాధ్యక్షులు బడే రాఘవరావు, ఉపాధ్యక్షులు మహతిశంకరరావు, కోశాధికారి ఎన్వీ వేణు, మహిళా కార్యదర్శి ఎన్‌.జ్యోతి, నాయకులు బెల్లం సత్యనారాయణ జీవీఎస్‌ ప్రసాద్‌, గల్లా సతీ, మద్ది సూరిబాబు, కన్నా రజనీ, కె.సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *