విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ టెన్నీస్ పోటీలకు ఎంపికైన విజయవాడ నగరానికి చెందిన యువకుడు సాలి విహీత్ ను ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభినందించారు. ఈ సందర్భంగా విహీత్ ను ఆంధ్రప్రభ కాలనీలోని తన కార్యాలయంలో సోమవారం ఘనంగా సత్కరించారు. ఆగష్టు 5-7, 2022 న జరుగు 15వ పోలాండ్ కప్ ఇంటర్నేషనల్ సాఫ్ట్ టెన్నీస్ టోర్నమెంట్ మరియు సెప్టెంబర్ 23-26, 2022 న జరుగు సాఫ్ట్ టెన్నీస్ జర్మన్ ఓపెన్ 2022 కు విహీత్ ఎంపిక కావడం శుభపరిణామమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఈ పోటీలలో విహీత్ ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. నగర యువతలో ఎంతో క్రీడా నైపుణ్యం దాగి ఉన్నదని.. విహీత్ వంటి యువకులే ఇందుకు చక్కని ఉదాహరణ అని తెలిపారు. యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు తనవంతుగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో విహీత్ మరెన్నో అంతర్జాతీయ క్రీడా పోటీలలో పాల్గొని విజయం సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని యువత క్రీడల్లో రాణించి ఆంధ్రప్రదేశ్ పేరును ప్రపంచ దేశాలకు వ్యాపింపజేయాలని ఈ సందర్భంగా మల్లాది విష్ణు కోరారు.
Tags vijayawada
Check Also
డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …