-ఉచిత కంటి పరీక్ష శిబిరం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడకూడదన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. సూర్యారావు పేటలోని కర్నాటి రామ్మోహన్ స్కూల్ ఆవరణలో వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరి సుబ్బారావు నేతృత్వంలో మల్లాది వేంకట సుబ్బారావు ఫౌండేషన్ మరియు మాక్సీ విజన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలో చెప్పకపోయినప్పటికీ డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అమలు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కంటిచూపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు ఈ పథకం వరంగా మారిందన్నారు. పథకం మొదటి రెండు దశల్లో 70.36 లక్షల మంది (మొదటిదశలో 66 లక్షల మంది, రెండోదశలో 4.36 లక్షల మంది) విద్యార్థులకు కంటిపరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ పథకం కింద ప్రజలు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండానే పూర్తి ఉచితంగా కంటి పరీక్షలతో పాటు అవసరమైన చికిత్సలు, కళ్ల జోళ్లను అందించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో వారానికి సుమారు ఆరువేల మందికి ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఏడాది చివరి కల్లా రాష్ట్రంలోని వృద్ధులందరి కంటిచూపు సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో వైద్య, ఆరోగ్యశాఖ చురుగ్గా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మరోవైపు మాక్సీ విజన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరాన్ని ఏర్పాటు చేసి రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం అభినందనీయమని మల్లాది విష్ణు అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం ద్వారా పేద కుటుంబాలకు తోడ్పాటును అందించినవారవుతారని తెలియజేశారు. అనంతరం వైద్యులు 150 మంది రోగులను పరీక్షించి ఉచిత మందులను అందజేశారు. అనంతరం మొక్కలను నాటారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు బాలి గోవింద్, మోదుగుల తిరుపతమ్మ, కొంగితల లక్ష్మిపతి, నాయకులు వెన్నం రత్నారావు, గుండె సుందర్ పాల్, అలంపూర్ విజయ్, బంకా భాస్కర్, శివా రెడ్డి, వడ్డీ వాసు, చల్లా సుధాకర్, నాడార్స్ శ్రీను, పార్టీ శ్రేణులు, కంటి వైద్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News