విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్య్ర పోరాట ఉద్యయం ద్వారా బ్రిటిష్ దాసశంఖలాల నుండి గిరిజన ప్రజలను విముక్తి కలిగించేందుకు అలుపుఎరగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని ఆయన అకుంటిత దీక్ష సాహసము ఏకగ్రత పోరాట పటిమ నేటి యువతకు స్పూరి దాయకమని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు.
అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న అజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని స్థానిక ఇందిరాగాంధీ స్టేడియం వద్ద విద్యార్థిని, విద్యార్థులతో ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు స్థానిక శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌తో కలిసి ప్రారంభించారు. బ్రిటిష్ ప్రభుత్వ దాసశంఖలాల నుండి భారతమాతకు విముక్తి కలిగించేందుకు అకుంటిత దీక్షతో పొరాడిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని కొనియాడరు. ఆయన త్యాగనిరతి, ధైర్య సాహసాలు, నేటికి ప్రతి ఒక్కరి గుండెలలో స్థిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో అల్లూరి సీతారామరాజుది ఒక ప్రత్యేక అధ్యాయమన్నారు. సాయుథ పొరాటం ద్వారానే స్వాతంత్య్రం వస్తుందని నమ్మి దాని కొరకే ప్రాణాలు అర్పించారన్నారు. ఆయన నేటి యువతకు స్పూర్తి దాయకంగా నిలుస్తారన్నారు. ఆయన జయంతి ఉత్సవాలలో భాగంగా జిల్లాలో 28వ తేదీన యోగా కార్యక్రమం, 29 తేదీన సంస్కృతిక కార్యక్రమం, 30 తేదిన వ్యాసరచన పొటీలు, జూలై 1వ తేదీన వక్తుత్వ పొటీలు, జూలై 2వ తేదిన వ్యాసరచన, వక్తుత్వ పొటీలు, 3వ తేదీన పాటలు ముగ్గులపొటీలు నిర్వహించ జరుగుతుందని 4వ తేదిన జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించి పొటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రధానం చేయడంతోపాటు పలువురు స్వాతంత్య్ర సమరయోదులను సన్మానించనున్నట్లు జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు తెలిపారు.
మల్లాదివిష్ణువర్థన్ మాట్లాడుతూ పరిమిత వనరులతో పొరాడి బ్రిటిష్ సామాజ్యాన్ని గడగడలాడిరచిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు. 27 ఏళ్ళ అతి చిన్నవయస్సులోనే నిరక్షరాసులు, నిరుపేదలు అమాయకులకు ఆయన పొరాటం ద్వారా విముక్తి కలిపించారన్నారు. అల్లూరి సీతారామరాజును స్మరించుకుని నేటి యువతకు ఆయన ధైర్యసాహసాలను త్యాగనిరతిని తెలియజేసేందుకు కేంద్రారాష్ట్ర ప్రభుత్వాలు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాలను జరపడం ఆ మహోన్నత వ్యక్తికి అందించిన గౌరవంగా భావిస్తున్నామన్నారు.
అనంతరం విద్యార్థిని విద్యార్థులు 125 అడుగుల జాతీయ పతాకంతో ఇందిరాగాంథీ స్టేడియం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా యువజన సర్వీసుల శాఖ సిఇవో యు. శ్రీనివాసరావు, ఆర్‌ఐవో పి రవికుమార్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి యం. రుక్మాంగదయ్య, పాఠశాల తనిఖీ అధికారి కొండ రవికుమార్, స్టేడియం ఛీఫ్ కోచ్ యండి అజీజ్, అమరావతి యోగా అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …