Breaking News

రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. కోటి విలువైన రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో దిగ్విజయంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 23వ డివిజన్ లో రూ. 95.90 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సురేష్ తో కలిసి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నియోజకవర్గంలో రహదారుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. నాడు – నేడు ద్వారా చేసిన ప్రగతిని ఎప్పటికప్పుడు ప్రజలకు చూపుతున్నామన్నారు. కానీ చేసిన అభివృద్ధి చెప్పుకోలేక టీడీపీ నేతలు విమర్శలతో కాలయాపన చేస్తున్నారన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉండగా వేసిన రోడ్లు తప్ప.. గత తెలుగుదేశం ప్రభుత్వం రోడ్లను కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. కానీ ఈ ప్రభుత్వం ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తోందన్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ ఆఫీస్ రోడ్డు, నరసింహనాయుడు రోడ్డుల నిర్మాణానికి రూ. 95.90 లక్షల నిధులతో నేడు శంకుస్థాపన చేసుకున్నట్లు వెల్లడించారు. గవర్నర్ పేట, సూర్యారావుపేటలలో రూ. 7.12 కోట్ల విలువైన రోడ్ల నిర్మాణ పనులను త్వరలో చేపట్టబోతున్నట్లు వివరించారు. రూ. 40 లక్షలతో ప్యాచ్ వర్క్ పనులు ఇప్పటికే పూర్తిచేశామన్నారు. అలాగే డివిజన్ లో సైడ్ డ్రెయిన్ల నిర్మాణానికి 14వ ఆర్థిక సంఘం నుంచి రూ. కోటి 50 లక్షల నిధులు మంజూరయ్యాయని.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు. దీంతో పాటు గవర్నర్ పేట, సూర్యారావుపేటలలో ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. దీనిపై సంబంధిత అధికారులకు గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగిందని మల్లాది విష్ణు అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఈ ప్రాంతం రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్)శ్రీనివాస్, డీఈ గురునాథం, ఏఈ వెంకటేష్, డివిజన్ కోఆర్డినేటర్ ఒగ్గు విక్కీ, నాయకులు వెన్నం రత్నారావు, చల్లా సుధాకర్, యర్రంశెట్టి అంజిబాబు, సుధాస్వామి, పసుమర్తి రాజేష్, వీఎంసీ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *