గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం

-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చొరవతో పలువురికి కుల ధ్రువీకరణ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు జారీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా పరిష్కారాలు లభిస్తున్నాయి. కుల ధ్రువీకరణ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ల కోసం ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్న పలువురు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా తమ సమస్యలను ఎమ్మెల్యే మల్లాది విష్ణు దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన తక్షణమే రెవెన్యూ ఉన్నతాధికారులతో మాట్లాడటం జరిగింది. ఎమ్మెల్యే చొరవతో జోయల్, ఉషా, సుభాకర్ అను వారికి కుల ధ్రువీకరణ పత్రాలు., షేక్ శివమ్మ అనే మహిళకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్., కోలాటపు జయలక్ష్మి అనే మహిళకు ఇంటి స్థల పట్టా మంజూరు అయ్యాయి. వీటిని ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో దరఖాస్తుదారులకు శుక్రవారం ఎమ్మెల్యే అందజేశారు. సమస్యను తన దృష్టికి తీసుకువచ్చిన వెనువెంటనే పరిష్కారం చూపడంపై దరఖాస్తుదారులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణుకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *