-రూ.50 లక్షల నగదు బహుమతి పొందిన విజయవాడ నగరపాలక సంస్థ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్మార్ట్ సిటీ మిషన్ దేశంలోని 30 నగరాలకు బెంగళూరులో జులై 7 & 8వ తేదీలలో రెండు రోజులు పాటు వర్క్‌షాప్ నిర్వహించడం జరిగింది. ఈ వర్క్ షాప్ నందు నాన్ స్మార్ట్ సిటీ లలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే పాల్గొని దేశంలోనే టాప్ 10లో నిలిచి, స్ట్రీట్ డిజైన్ అవార్డును గెలుచుకొని రెండోవ ర్యాంక్ సాధించింది. అదే విధంగా తదుపరి పనులు చేపట్టడానికి నగరపాలక సంస్థ కు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వబడుతుంది. సత్యనారాయణ పురంలో మోడల్ స్ట్రీట్ డిజైన్‌ను చేపట్టారు. భారత ప్రభుత్వ స్మార్ట్ సిటీ మిషన్ డైరెక్టర్ శ్రీ రాహుల్ కపూర్ నుండి డిప్యూటీ సిటీ ప్లానర్(ప్లానింగ్) జూబిన్ శిరన్ రాయ్ ఈ అవార్డును అందుకున్నారు.