Breaking News

బక్రీద్ సందర్భంగా విస్తృత తనిఖీలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బక్రీదు సందర్భంగా కబేళా ను శనివారం పశ్చిమ నియోజకవర్గం తహసీల్దార్ మాధురి, మున్సిపల్ వెటర్నటీ డాక్టర్. రవి చంద్, భవానిపురం సీఐ. ఎండి ఉమర్ నేతృత్వంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. పశ్చిమ తాసిల్దార్ మాధురి మాట్లాడుతూ కలెక్టర్ వారి ఆదేశాల మేరకు కటింగ్ కి వెళ్లే ముందు యానిమల్ స్లాటరింగ్ వెళ్లే పశువులను డాక్టర్ సర్టిఫై చేసి వెళుతుంది. దీని కొరకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేశామని, ఇటువంటి ఇబ్బందులు ఉన్న అధికారులకు దృష్టికి తీసుకురావాలని తాసిల్దార్ అన్నారు. మున్సిపల్ వెటర్నరీ డాక్టర్ రవి చందర్ మాట్లాడుతూ బక్రీద్ పండగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి జీవాలు వస్తుంటాయని అప్రమత్తంగా ఉంటామని కమిషనర్ ఆదేశాల మేరకు పది టీములు ఏర్పాటు చేశామని బక్రీదు పండగ సందర్భంగా టెంట్లు. వేస్టేజ్. వెహికల్స్. వాటర్ ఏర్పాట్లు చేశామని నిరంతరం వెటర్నటీ టీమ్ అంతా నిఘా ఉంటుందని డాక్టర్ రవిచంద్ర తెలిపారు. భవానిపురం సిఐ ఎండి , ఉమర్ మాట్లాడుతూ భవానిపురం పోలీసులు బక్రీద్ సందర్భంగా కబేళా ఏరియాలో అప్రమత్తంగా ఉంటామని ఎటువంటి ఇబ్బందులు ఉన్న పోలీసులు వారిని సంప్రదించాలని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *