Breaking News

సెంట్రల్ నియోజకవర్గాన్ని విద్యావంతుల హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-పాఠశాల విద్యకు మూడేళ్లలో రూ. 202.31 కోట్లు కేటాయింపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో సెంట్రల్ నియోజకవర్గాన్ని విద్యావంతుల హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. గడిచిన మూడేళ్లలో నియోజకవర్గంలో పాఠశాల విద్యకు రూ. 202.31 కోట్లు ఖర్చు చేసినట్లు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పేద పిల్లలు పెద్ద చదువులు చదివి గొప్ప గొప్ప డాక్లర్లు, ఇంజనీర్లు అవ్వాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అని ఈ సందర్భంగా మల్లాది విష్ణు వెల్లడించారు. అమ్మఒడి, నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, విద్యాకానుక, గోరుముద్ద లాంటి కార్యక్రమాలతో ఇప్పటికే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. గత తెలుగుదేశం హయాంలో విద్యారంగాన్ని వ్యాపారంగా మార్చి కార్పొరేట్ కబంధ హస్తాలలో పడవేసిందని గుర్తుచేశారు. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలు చేపట్టి.. 100 శాతం అక్షరాస్యత సాధించే దిశగా అడుగులు వేస్తోందన్నారు. ప్రతి విద్యార్థి తాను కలలుగన్న విద్యను అభ్యసించేందుకు అన్నిరకాల తోడ్పాటును అందిస్తున్నట్లు వివరించారు. అమ్మఒడి పథకానికి సంబంధించి మేనిఫెస్టోలో కేవలం బడికి వెళ్లే పిల్లలకు మాత్రమేనని పేర్కొన్నప్పటికీ.. తర్వాత ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు సైతం వర్తింపజేయడం జరిగిందన్నారు. ఈ పథకానికి సంబంధించి సెంట్రల్ నియోజకవర్గంలో 25 వేల మంది తల్లుల ఖాతాలలో మూడేళ్లలో రూ. 112.91 కోట్లు (తొలి విద్యా సంవత్సరం రూ. 33.15 కోట్లు., రెండో ఏడాది రూ. 40.76 కోట్లు., మూడో ఏడాది రూ. 39 కోట్లు) జమ చేసినట్లు పేర్కొన్నారు. విద్యాకానుక ద్వారా 15,474 మంది విద్యార్థులకు ఏటా నోట్‍ బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీ, 3 జతల దుస్తులు, బూట్లు, బెల్టు, సాక్సులు ఇస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం మూడేళ్లలో రూ. 8.64 కోట్లు (తొలి సంవత్సరం రూ. 2.70 కోట్లు., రెండో ఏడాది రూ. 2.90 కోట్లు., మూడో ఏడాది రూ. 3.04 కోట్లు) ఖర్చు చేసినట్లు వివరించారు.

జగనన్న ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా 2018–19 నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 37.21 లక్షలుగా ఉన్న అడ్మిషన్ల సంఖ్య.. దాదాపు రూ.7 లక్షలు పెరిగి 2021–22 నాటికి 44.30 లక్షలకు చేరిందని మల్లాది విష్ణు అన్నారు. దీంతో పాటు విద్యా రంగంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నారని.. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను సమూలంగా మార్చివేయడం జరిగిందన్నారు. బ్లాక్‌బోర్డ్, లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, త్రాగునీరు, టాయిలెట్లు, కాంపౌండ్‌వాల్‌ ఇలా పదిరకాల సౌకర్యాలను కల్పించేందుకు భారీ మొత్తంలో ఖర్చుచేస్తోందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఇందుకోసం 26 పాఠశాలలకు గానూ రూ.50.76 కోట్లు కేటాయించగా పనులు శరవేగంగా జరగుతున్నాయన్నారు. మధ్యాహ్న భోజన విషయంలోనూ ఎక్కడా రాజీపడకుండా చిన్నారులకు నాణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం నియోజకవర్గంలో ఏటా రూ. 10 కోట్లు ఖర్చు చేస్తుండగా.. గ్రీన్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు బిల్లులను క్లియర్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు పేదపిల్లలు ప్రపంచంతో పోటీపడే విధంగా బైజూస్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు మల్లాది విష్ణు పేర్కొన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు భవిష్యత్‌లో ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన పూర్తి సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నట్లు ఉద్ఘాటించారు. భావితరాల తలరాతలు మార్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిఒక్కరూ అండగా నిలవాలని ఈ సందర్భంగా కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *