Breaking News

దామాషా ప్రకారం ముస్లింలకు సంక్షేమ పధకాలు అందించటంలో ప్రభుత్వం విఫలం… : షేక్ జలీల్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దామాషా ప్రకారం ముస్లింలకు సంక్షేమ పధకాలు అందించటంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్  అన్నారు. విజయవాడ గాంధీ నగర్ ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ మాట్లాడుతూ వై.సి.పి. ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినప్పటి నుండి నేటి వరకు ముస్లిం హక్కులను కాలరాస్తు మోస పూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి పేద మహిళ ముస్లింలకు దల్షన్ పధకం క్రింద వచ్చు నిధులు గత ప్రభుత్వం 50 వేల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఆ పధకం రద్దు చేశారు. అదే విధంగా అన్యాక్రాంతమైన వక్స్ బోర్డు భూములు స్వాధీనం చేసుకొని ముస్లీంలోనే నిరుపేదలకు కేటాయించక పోవటం బాధకారమని అవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 70 వేల ఎకరాలు వక్స్ బోర్డు భూములు ఉన్నప్పటికి దాని పై వచ్చిన ఆధాయం ప్రభుత్వం నిరుపేద ముస్లింలకు అందించాలని కోరారు. నసీర్ అహ్మమద్ మగ్బుల్ సాబ్ హాటీ హాలీ ముస్లీంలా బోర్డు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లింలు ఉపాధి లేక ఆకలి కేకలతో చనిపోతున్నారని వీళ్ళ జీవనోపాధి కొరకు ప్రభుత్వం నుండి వచ్చే మైనార్టీ లోన్లు మరియు ముస్లీం పేద విధ్యార్థులకు స్కాలర్ షిప్ అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉర్దు బాషాను నిర్వీరం చేశారు. నిరుపేద ముస్లీంలకు ఇండ్ల స్థలాలు కేటాయించలేదు. ప్రభుత్వం పాలిచే హక్కు కాల్పోయారు. భారత దేశంలో బి.జె.పి. ఆంధ్రప్రదేశ్లో వై.సి.పి. పార్టీ దొందు దొందుగానే వ్యవహరించుచున్నాయి. ఈ నెల 15న జరిగే బంద్ కు ముస్లీంలు అంతా ఏకమయి బంద్ ను విజయవంతం చేయాలన్ని పిలుపునిచ్చారు. బంద్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా చేయలని వాణిజ్య వ్యాపారస్తులు, అన్ని ట్రేడ్ యూనియన్లు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు, బి.సి.యస్.సి.యస్.టి. మైనార్టీ సంఘాలు అదే విధంగా సి.పి.ఐ. సి.పి.యం. జనసేన, కాంగ్రెస్, టి.డి.పి. పార్టీలు జులై 15 న జరిగే బందుకు మద్దతు ఇవ్వాలని బహిరంగంగా తెలియపరుచుచున్నాను. అన్ని రాజకీయ పార్టీలు ప్రజా ప్రతినిధులు మా ఆహ్వానానికి హాజరు అవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *