రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో చేపడుతున్న ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు నిర్మాణం పనుల విషయంలో స్టేజ్ కన్వర్షన్ లో ఇకపై వారం వారం 25 శాతం మేర పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం తాడేపల్లి సి ఎం ఓ కార్యాలయం నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి, పిఆర్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కొన శశిధర్ లు ఎమ్ జి ఎన్ ఆర్ ఈ జీ పనుల్లో భాగంగా చేపడుతున్న అర్భికెలు, సచివాలయ, హెల్త్ క్లినిక్స్, బి ఎమ్ సి యూ భవన నిర్మాణ పనుల స్టేజ్ కన్వర్షన్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు పాల్గోన్నారు.
ఈ సందర్భంగా స్పెషల్ సి ఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో వివిధ శాఖలకు చెందిన భవన నిర్మాణ పనులను చేపట్టడం జరుగుతున్న వారం వారం ప్రగతి 10 శాతం మాత్రమే ఉందన్నారు. వచ్చే వారం సమీక్ష నాటికి 25 శాతం పురోగతి సాధించాలన్నారు. అదే సమయంలో ఆయా పనులు పూర్తి చేసిన వెంటనే బిల్లులను అప్లోడ్ చేయాలి అని పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ఎన్ ఆర్ ఈ జీ ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను నిర్ణీత సమయం లో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేజ్ కన్వర్షన్ విషయంలో క్షేత్ర స్థాయి లో మరింత పురోగతి సాధించాల్సి ఉందని పేర్కొన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కే. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో సచివాలయ భవనాలు 390 కి గాను 255 పూర్తి చేసి, మిగిలినవి పురోగతి లో ఉన్నాయన్నారు. అర్భికే లు 373 కి గాను 174 పూర్తి చేశామన్నారు. ఇంకా 199 పూర్తి చేయాల్సి ఉండగా 37 భవనాలు బేస్మెంట్ స్థాయి కంటే తక్కువ స్థాయి లో ఉనాయన్నరు. సచివాలయ భవనాలు 13, హెల్త్ క్లినిక్స్ 67 బిబిఎల్ స్థాయి లో ఉన్నాయని, వొచ్చ వారం నాటికి కోర్టు కేసులు ఉన్నవి తప్ప మిగిలిన అన్ని ప్రారంభం కావాలన్నారు. ప్రతి ఒక్క భవనం స్టేజ్ కన్వర్షన్ లో కేవలం సగటున 10 శాతం మాత్రమే ప్రగతి ఉందని, వాటిని 25 శాతం వరకు తీసుకుని వెళ్లాలన్నారు. జిల్లాలో బి ఎమ్ సి యూ 49, ఏ ఎమ్ సి యూ 30 భవనాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగిందని, వాటిని అన్నింటినీ గ్రౌండింగ్ చేసే దిశలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన స్థలాలు గుర్తింపు కోసం క్షేత్ర స్థాయి లో కంబైన్డ్ తనిఖీలు నిర్వహించి ప్రతిపాదనలు చెయ్యాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా అధికారులు పి ఆర్ ఎస్ ఈ., ఎస్ బి వి ప్రసాద్, ఆర్ అండ్ బి ఎస్ ఈ ., ఎస్ బి వి రెడ్డి, డి ఏ హెచ్ ఎస్ టి డా. ఎస్ టి జి సత్య గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News